Varalaxmi Sarathkumar : ఆ హీరో సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్..

టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ హిట్లు పహ్లవులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ కుర్ర హీరో చివరగా నిన్ను వీడని నీడను నేనే అని హారర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ సాధించాడు.

Varalaxmi Sarathkumar : ఆ హీరో సినిమాలో మరోసారి విలనిజం చూపించనున్న వరలక్ష్మీ శరత్ కుమార్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2021 | 4:54 PM

Varalaxmi Sarathkumar : టాలీవుడ్ యంగ్ సందీప్ కిషన్ హిట్లు పహ్లవులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ కుర్ర హీరో చివరగా నిన్ను వీడని నీడను నేనే అని హారర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించి సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన ఆవి హిట్ అవ్వలేదు. తాజాగా ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు . మార్చి 5న ఈ సినిమా విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత సందీప్ ఓ సినిమా చేయబోతున్నాడు. నూతన దర్శకుడు వేదవ్యాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ చిత్రాన్ని.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. గత నెలలోనే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్బ్ షూటింగ్ కూడా ఇటీవలే మొదలు పెట్టారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ను ఎంపిక చేశారు. కాగా ప్రియా తెలుగులో తన మొదటి సినిమా నితిన్ నటించిన ‘చెక్’ రిలీజ్ కాక ముందే వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనున్నారు. గతంలో సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో వరలక్ష్మీ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోనూ అదే తరహా విలన్ పాత్రలో నటించనున్నారని టాక్. ఇక ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఇక సందీప్ నటిస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాలో సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ  చదవండి : 

నవ్వు, అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుని చిన్న వయసులోనే నేలరాలిన తార ప్రత్యూష వర్ధంతి