Andhra Pradesh: అద్భుతం.. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఎక్కడో కాదు మన ఏపీలోనే..
ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్ కి.. 50 శాతం విద్యుత్ అందించే ప్రాజెక్టు అది. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయం. మరో 14 వేల కోట్లు ఖర్చు పెడుతోంది ఆ సంస్థ. ఇంతకు ఏమిటా ప్రాజెక్టు? ఎక్కడ ఉన్నది? ప్రత్యేకతలు ఏంటి..? ఇప్పుడు ఎందుకు హాట్ టాపిక్ గా మారింది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్టు.. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్ కి.. 50 శాతం విద్యుత్ అందించే ప్రాజెక్టు అది. ఇప్పటికే 10 వేల కోట్ల వ్యయం. మరో 14 వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు.. ఇంతకు ఆ ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏంటి..? ఏమిటా ప్రాజెక్టు? ఎక్కడ ఉంది? పూర్తి వివరాలను తెలుసుకోండి.. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం పరిధిలో గ్రీన్ కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.. ఇప్పటికే దీని పనులు 80% పైగా పూర్తయ్యాయి. పలు దేశాల భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టుకు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటంటే… సౌర, పవన, హైడల్.. విద్యుత్ ఒకే చోట జరుగుతుండటం. మరో విశేషం ఏంటంటే.. విద్యుత్ ఉత్పత్తికి వాడే నీటిని రీసైకిల్ చేయడం. ఎగువ నుంచి నీటిని దిగువకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం, అదే నీటిని వెనక్కి రప్పిస్తూ మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేయడం… దీని స్పెషాలిటీ. సూర్య రష్మి ఉన్నంతవరకు సౌర విద్యుత్, పవన్ విద్యుత్, రాత్రి వేళల్లో హైడల్ పవర్ ప్రొడక్షన్. ఇలా మూడు రకాల విద్యుత్ ప్రత్తిని ఒకే చోట చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విద్యుత్తులో ఏకంగా 50 శాతం విద్యుత్ ఉత్పత్తి ఒకే చోట జరగడం దీని స్పెషాలిటీ అని సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా ముందర చెప్పడం విశేషం. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మరో 14 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రీన్ కో ఓర్వకల్, గని తదితర ప్రాంతాలలో భారీ ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. దాదాపు 1000 ఎకరాలకు పైగా అటవీ భూములు ఇందులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నెల్లూరు జిల్లాలో అటవీ శాఖకు అంతే స్థాయిలో భూములు ఇవ్వడం జరిగిందని పవన్ కళ్యాణ్ వివరించారు. మరికొంత అటవీ భూములపై రెవెన్యూ అటవీ శాఖ మధ్య వివాదం నడుస్తున్నందున పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు గనుక పూర్తి అమలులోకి వస్తే విద్యుత్ సమస్య చాలావరకు పరిష్కారం అవడమే కాకుండా…. ఇతర ప్రపంచ దేశాలకు కూడా విక్రయించే లా ప్రయత్నం చేస్తామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
వీడియో చూడండి..
విద్యుత్ ఉత్పత్తితోపాటు.. చూడటానికి చాలా అద్భుతంగా ఉందని ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా దీనిని చేసే ప్రయత్నంలో పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పడం చర్చనీయంకంగా మారింది. పవన్ కళ్యాణ్ వచ్చి మీడియంలో చెప్పే వరకు బయట ప్రపంచానికి ఇంత ప్రాజెక్టు ఉందా? అనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడైనా ఇంత భారీ ప్రాజెక్టు బయటి ప్రపంచానికి కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
జగన్ శంకుస్థాపన..
అయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టుకు కర్నూలులో 2022లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 5230 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో గ్రీన్‌కో గ్రూప్ చేపట్టిన ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలుస్తుందంటూ పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
