AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. అక్షరాలనే అద్భుత చిత్రంగా మలిచిన వీరాభిమాని!

ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన వర్ధంతి సందర్భంగా ఓ చిత్రకారుడు వినూత్నంగా నివాళి అర్పించారు. తెలుగు దేశానికి ఎంతో సేవ చేసిన 'ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి..' అనే మూడు పదాలనే తెల్ల పేపర్ పై రాస్తూ.. ఆ రాతలనే చిత్రంగా గీశాడు. అలా ఎన్టీఆర్ చిత్రాన్ని అక్షరాలతో నింపేశాడు. చూసేందుకు విచిత్రంగా ఉన్న ఈ పోట్రెయిట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది..

Watch Video: ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి.. అక్షరాలనే అద్భుత చిత్రంగా మలిచిన వీరాభిమాని!
NTR Portrait With Letters
J Y Nagi Reddy
| Edited By: Srilakshmi C|

Updated on: Jan 20, 2025 | 9:25 AM

Share

స్వర్గీయ ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలనే నినాదంతో ఎన్టీఆర్ వీరభిమాని, ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ గీసిన చిత్రం అందరినీ అకట్టుకుంటుంది. ఎన్టీఆర్ వర్థంతిని పురష్కరించుకొని కోటేష్ మూడుగంటల పాటు శ్రమించి ‘ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి’.. అనే అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రం గీశారు. ఎత్రీ డ్రాయింగ్ షీట్ పై మైక్ పెన్ తో ఎన్టీఆర్ చిత్రం ఎంతో అద్బతంగా గీశారు. ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ పై అభిమానంతో ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలి అనే నినాదంతో గీసిన ఈ చిత్రం అందరిని అకట్టకుంటుంది.

ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ వీరాభిమానని అన్నారు.ఎన్టీఆర్ విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు అని అనేక పౌరణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి అందరిని మెప్పించారన్నారు. అంతే కాకుండా రాముడు, కృష్ణుడు లాంటి పౌరణిక పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో శాశ్వతంగా, ఆరాధ్య దేవునిగా నిలిచిపోయారని కొనియాడారు. అంతే కాకుండా ఎన్టీఆర్ దేశంలోనే గర్వించ దగ్గ నటులు ఒకరని,దర్శకులు,నిర్మాతగా,సంపాదకులు, స్క్రీన్ రైటర్ గా అయన చూపిన ప్రతిభ గుర్తించదగినదన్నారు.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ తెలుగుదేశం అనేపార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పని చేస్తూ అనే సంక్షేమ పథకలు బడుగు,బలహీన వర్గాల కోసం అమలు చేసిన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. భారతరత్న కు అన్ని అర్హతలు ఉన్నా ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఎన్టీఆర్ కు చిత్రనివాళి అర్పిస్తూన్నట్లు తెలిపారు. కోటేష్ ఇదొక్కటే కాదు అనేక అద్భుత చిత్రాల గీసి అందరితో మన్ననలు పొందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.