Watch Video: ఆవుకు తులాభారం వేసిన గ్రామస్తులు.. ఆ నాణేలను ఏం చేశారంటే..
తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ మాస పౌర్ణమిని పురస్కరించుకొని, గ్రామస్థులు గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో బొలెద్దుపాలెం గ్రామానికి చెందిన స్థానికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం నియోజకవర్గంలోని కోరుకొండ మండలం బొల్లెద్దుపాలెంలో శ్రావణ మాస పౌర్ణమిని పురస్కరించుకొని, గ్రామస్థులు గోమాతకు ధన తులాభారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోరుకొండకు చెందిన శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో బొలెద్దుపాలెం గ్రామానికి చెందిన స్థానికులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు లక్షా ముప్పైవేల విలువ గల చిల్లర నాణాలతో గోమాతను తులాభారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి 11 చిల్లర నాణాల వంతున అందజేసి, ఈ మహాక్రతువులో ఉదయం నుండి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతల వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ, శ్రావణమాస పౌర్ణమి రోజున తమ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని, హిందూతత్వం మరింత ప్రజలకు చేరువవుతుందని తెలిపారు. గోమాత తులా భారానికి లక్ష్మీదేవి కృపకు మేమంతా పాత్రులమయ్యామన్నారు. గోమాతకు తులాభార కార్యక్రమంలో ఉదయం నుండి కంకణాలు కట్టి, పూజలు చేసి తులాభారం చుట్టూ ప్రదక్షిణ చేసి, హరతులు ఇచ్చారు. తులాభారం వద్ద గోమాతకు పెట్టిన వస్తువులు సిరిసంపదలకు ప్రతికగా గ్రామస్తులు వెల్లడించారు. గోమాతకు వేసిన నాణేలను భక్తులకు పంచిపెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..