నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం.. ఇంతలోనే విషాదం.. ద్విచక్ర వాహనం నుంచి జారిపడి మహిళ మృతి..
నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం. స్నేహితులు, బంధువులను ఆ వేడుకకు ఆహ్వానించడానికి వెళ్తున్న ఆ ఇంటి ఇల్లాలిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది.
సంతకవిటి: నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం. స్నేహితులు, బంధువులను ఆ వేడుకకు ఆహ్వానించడానికి వెళ్తున్న ఆ ఇంటి ఇల్లాలిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. సంతకవిటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్వోగా విధులు నిర్వర్తిస్తున్న కె.సరోజిని (55).. భర్త ప్రదీప్తో కలిసి ద్విచక్ర వాహనంపై పెళ్ళి పిలుపుకు సంతకవిటి నుంచి రాజాం బయల్దేరారు. గుళ్ళసీతారాంపురం సమీపంలోని మలుపు వద్ద బైక్ రోడ్డు అంచుకు తగిలి అదుపు తప్పింది. వెంటనే బైక్ పై ఉన్న సరోజిని జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందారు. సరోజిని ప్రస్తుతం రాజాంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కుమారుడు చక్రవర్తి, కుమార్తె శ్రావణి ఉన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.