Eluru Mystery Disease: ఏలూరులో మరో నలుగురికి వింత వ్యాధి లక్షణాలు.. 616కి చేరిన బాధితుల సంఖ్య…

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరో నలుగురు వ్యక్తులు వింత వ్యాధి..

Eluru Mystery Disease: ఏలూరులో మరో నలుగురికి వింత వ్యాధి లక్షణాలు.. 616కి చేరిన బాధితుల సంఖ్య...
Follow us

|

Updated on: Dec 13, 2020 | 9:22 AM

Eluru Mystery Disease: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతోంది. తాజాగా మరో నలుగురు వ్యక్తులు వింత వ్యాధి లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. దీంతో మొత్తం అస్వస్థతకు గురైన బాధితుల సంఖ్య 616కి చేరింది. ఇప్పటివరకు 576 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం ఐదుగురు  ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 35 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

మరోవైపు తాగునీటి పరిశుభ్రతపై ఏలూరు మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిపెట్టింది. దీంతో వింత వ్యాధి ప్రబలిన బాధిత ప్రాంతాల్లో నీటి సరఫరా మెరుగుపడింది. కాగా, తుదినివేదికలన్నీ అందాకే వ్యాధి లక్షణాలకు కారణాలపై ప్రభుత్వం ఓ నిర్ధారణకు రాబోతోంది. అప్పటిదాకా కొత్తగా ఏమైనా కేసులొచ్చినా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలున్నాయి. కోలుకుని ఇంటికి వెళ్లిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు వైద్యారోగ్యశాఖ అధికారులు.

Also Read:

‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైన రోహిత్ శర్మ.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న హిట్‌మ్యాన్..

మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..