AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం.. మినీ ట్రక్కుల లభ్దిదారుల ఎంపిక పూర్తి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ధకే ఇవ్వడానికి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి

ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీకి ఏర్పాట్లు వేగవంతం.. మినీ ట్రక్కుల లభ్దిదారుల ఎంపిక పూర్తి..
Rajitha Chanti
|

Updated on: Dec 13, 2020 | 7:11 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యం, నిత్యావసర సరుకుల్ని నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్ధకే ఇవ్వడానికి ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఇందుకోసం ఈ నెల 4న అధికారులు జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించి మినీ ట్రక్కులు పొందేందుకు లబ్ధిదారుల జాబితాలను తయారు చేశారు. కాగా ఎంపికైన లబ్ధిదారుల జాబితాలపై జిల్లాల కలెక్టర్లు ఆమోద ముద్ర వేసి ఆయా జిల్లాల ఇన్‏చార్జ్ మంత్రులకు పంపించారు. ఇన్‏చార్జ్ మంత్రి ఆమోదం రాగానే జాబితాను రాష్ట్రస్థాయి అధికారులను పంపించనున్నారు.

అటు రాష్ట్రస్థాయి అధికారుల నుంచి ఆమోదం పొందిన జాబితాను ముఖ్య కార్యదర్శికి పంపిస్తారు. వారి నుంచి అనుమతి రాగానే తిరిగి జిల్లాకు ఈ జాబితాలను పంపనున్నారు. ప్రభుత్వం నియమాల ప్రకారం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మినీ ట్రక్కులను కేటాయించారు. ఆయా కార్పొరేషన్ల ఈడీలు సంబంధిత బ్యాంకులతో మాట్లాడి ఎంపికైన లబ్ధిదారులకు మినీ ట్రక్కులను కొనడానికి లోన్స్ ఇప్పిస్తారు. ఈ ట్రక్కులను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఇంటింటికీ బియ్యం, నిత్యావసర సరుకుల్ని రవాణాకు మాత్రమే ఉపయోగిస్తారు. లబ్ధిదారుల తరుపున లోన్ రుణాలను 72 వాయిదాల్లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నేరుగా బ్యాంకులకు చెల్లిస్తుంది. బ్యాంక్ లోన్‏తోపాటు అన్ని ఖర్చులు పోనూ రూ.10 వేల చొప్పున లబ్ధిదారులకు చెల్లించనుంది. కాగా 72 నెలల అనంతరం మినీ ట్రక్కు లబ్ధిదారుని సొంతమవుతుంది.

Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?