Watch Video: అడిగినంత డబ్బు ఇవ్వలేదనీ.. భార్యతో కలిసి కన్న తల్లిని చంపిన కసాయి కొడుకు! వీడియో
Son killed Mother for money and gold in Sri Sathya Sai district: డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కసాయి కొడుకు భార్యతో కలిసి కన్న తల్లినే కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. అనంతరం దంపతులు ఇద్దరూ పారరయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారైన కశాయి కొడుకు, అతడి భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా

కదిరి, అక్టోబర్ 20: తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఓ కసాయి కొడుకు భార్యతో కలిసి కన్న తల్లినే కత్తితో పొడిచి దారుణంగా చంపాడు. అనంతరం దంపతులు ఇద్దరూ పారరయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు పరారైన కశాయి కొడుకు, అతడి భార్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ దారుణ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని నిజాంవలి కాలనీలో తల్లి ఖాసీమ్-భీని కొడుకు బాబా ఫక్రుద్దీన్, అతడి భార్య రసూల్-భీ కలిసి వారం రోజుల క్రితం కట్టె, కత్తి తీసుకొని కొట్టి చంపారు. అనంతరం ఇద్దరూ పరారైనట్లు మృతురాలు కుమార్తె అమ్మాజాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని చంపిన అన్న, వదినలు.. పారిపోతూ తల్లి వద్ద నుంచి కొంత నగదు, మూడు తులాల బంగారం, ఇంటి పత్రాలను దోచుకెళ్లినట్లు ఫిర్యాదులో మృతురాలు కూతురు అమ్మాజాన్ పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి మూడు తులాల బంగారం, ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. కన్నతల్లిని చంపిన కొడుకు, అతనికి సహకరించిన అతడి భార్యను కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించించింది. దీంతో పోలీసులు వారిద్దరినీ జైలుకు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








