Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. పీకే టీమ్‌ను చంద్రబాబు వద్దన్నారా..? ఎవరి టీమ్ ఏం చేస్తోంది..

Andhra Pradesh Politics: ఎన్నిక ఏదైనా వ్యూహం ఉండాల్సిందే.. నిర్ణయం ఏదైనా తుది నివేదిక ఇవ్వాల్సిందే.. జననాడిని, నేతల చూపును ఎప్పటికప్పుడు పసిగట్టే ఆ షాడో టీమ్‌లు రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఏపీలో కూడా ఆ టీమ్‌లు ఇచ్చిన నివేదికలే పార్టీల అధినేతలకు ఫైనల్ రిపోర్ట్.. అందుకే అందుకే ఆ టీమ్‌లకు అంతటి ప్రాధాన్యత నెలకొంది.

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో సంచలనం.. పీకే టీమ్‌ను చంద్రబాబు వద్దన్నారా..? ఎవరి టీమ్ ఏం చేస్తోంది..
Chandrabau YS Jagan
Follow us
S Haseena

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 27, 2023 | 11:08 AM

Andhra Pradesh Politics: ఎన్నిక ఏదైనా వ్యూహం ఉండాల్సిందే.. నిర్ణయం ఏదైనా తుది నివేదిక ఇవ్వాల్సిందే.. జననాడిని, నేతల చూపును ఎప్పటికప్పుడు పసిగట్టే ఆ షాడో టీమ్‌లు రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఏపీలో కూడా ఆ టీమ్‌లు ఇచ్చిన నివేదికలే పార్టీల అధినేతలకు ఫైనల్ రిపోర్ట్.. అందుకే అందుకే ఆ టీమ్‌లకు అంతటి ప్రాధాన్యత నెలకొంది. అయితే, ఏపీలో ఎన్నిక ఏదైనా గెలుపు వైఎస్సార్సీపీదే.. కనీవినీ ఎరుగని స్థాయిలో సీట్లు సాధించి రికార్డ్ సృష్టించింది జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక ఎవరి స్ట్రాటజీ ఉందో అందరికీ తెలుసు.. అదే ప్రశాంత్ కిషోర్ టీమ్.. వైసీపీ నేతలకు కొన్నేళ్లుగా వెనకుండి విజయాలు అందిస్తోంది.. పీకే టీం వ్యూహాలతోనే వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభించిందని పేర్కొంటుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వ్యహాలతో ముందుకు వెళ్తూ ప్రభుత్వానికి బలంగా మారింది పీకే టీం.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం అనేది ప్రశాంత్ కిషోర్ ఆలోచనగానే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో పార్టీ కేడర్ ప్రజల్లో ఉండటం,ప్రతి గడపనూ టచ్ చేయడం ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా చేశారు. అంతేకాదు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలపై స్వయంగా ఎమ్మెల్యేలు,ఇంచార్జిలు వెళ్లి తెలుసుకోవడం ద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలతో నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక్కో టీంని ఏర్పాటు చేయడం, స్థానిక నేతలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు ఇస్తున్నారు ప్రశాంత్ కిషోర్ టీం.. రెండు మూడు నెలలకోసారి పీకే టీం ఇచ్చే నివేదికలను సీఎం జగన్ స్వయంగా నేతల ముందు ఉంచుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా? స్థానిక నేతలపై ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది సీఎంకు అందిస్తున్నారు. అయితే వైసీపీకి ఇంత మంచి పేరు తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తున్న ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికలకు టీడీపీకి పని చేయనున్నారని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది. చంద్రబాబును కూడా ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు టీడీపీ వర్గాలు చెప్పుకోచ్చాయి. అయితే, ఈ విషయంలో మళ్లీ చంద్రబాబు వెనక్కి తగ్గారని తెలిసింది.

చంద్రబాబు పీకే టీంను వద్దన్నారా?

వైఎస్సార్ సీపీకి పీకే టీం వెనక ఉండి నడిపిస్తున్నట్లుగానే.. తెలుగుదేశం పార్టీ కూడా రెండేళ్ల క్రితం ఓ స్ట్రాటజీ టీమ్ ను ఏర్పాటు చేసుకుంది. గతంలో ప్రశాంత్ కిశోర్ టీంలో పనిచేసిన సీనియర్ స్ట్రాటజిస్ట్ రాబిన్ సింగ్ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. రాబిన్ సింగ్ టీం ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా టీడీపీ ఎప్పటికప్పుడు తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది. అయితే, ప్రశాంత్ కిషోర్ టీం ను తన వైపుకు తిప్పుకొనేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. పీకే తో ఒకసారి సమావేశం కూడా జరిగినట్లు చెబుతున్నారు. త్వరలోనే వైసీపీకి పీకే గుడ్ బై చెబుతారని కూడా విస్తృతంగా ప్రచారం జఠిగింది. అయితే, తాజాగా ప్రశాంత్ కిషోర్‌ను తాము తీసుకోవడం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రాబిన్ శర్మ టీం పని చేస్తుండటం, కొత్తగా పీకే టీంను తీసుకోవడం ద్వారా చాలా సమీకరణాలు మారిపోయే ఛాన్స్ ఉందని సీనియర్లు చెప్పడంతో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు వద్దని చెప్పడంతో ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పని చేస్తారని సమాచారం. ప్రస్తుతం వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో ఐప్యాక్ టీం తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తరహాలో మరో కొత్త కార్యక్రమానికి ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం..

అసలు ఎవరి టీం ఏం చేస్తోంది..

ఇవి కూడా చదవండి

గత ఎన్నికల్లో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ బాగా కలిసొచ్చింది. అయితే అప్పట్లో టీడీపీకి ఎలాంటి స్ట్రాటజీ టీమ్ లేదు. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న బ్యాక్ ఎండ్ టీమ్ ఇచ్చిన నివేదికలు ఆధారంగానే చంద్రబాబు నిర్ణయాలు తీసుకునేవారు. అయితే, పీకే టీం రిపోర్ట్స్‌తో వైసీపీకి తిరుగులేని విజయాలు అందాయి. దీంతో అదే టీమ్‌లో పనిచేసిన రాబిన్ సింగ్ ను టీడీపీ తన స్ట్రాటజీ టీమ్ గా పెట్టుకుంది. రెండు టీమ్‌లు కూడా ఎప్పటికప్పుడు సొంత పార్టీ చేయాల్సిన కార్యక్రమాలతో పాటు క్షేత్ర స్థాయి నివేదికలను ఆయా పార్టీల అధినేతలకు అందిస్తున్నారు. అంతేకాదు పీకే, రాబిన్ సింగ్ లు ఇచ్చే సలహాలను సోషల్ మీడియా ద్వారా బాగా ప్రచారంలోకి తీసుకెళ్తున్నాయి రెండు పార్టీల. దీంతో ఈసారి రెండు పార్టీలకు ఆయా టీంలు చాలా బలంగా మారాయని చెప్పవచ్చు. సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడంలో స్ట్రాటజీ టీమ్‌ల సలహాల పైనే రెండు పార్టీలు ఆధారపడ్డాయి. మరి పీకే టీమ్‌తో వైసీపీ, రాబిన్ సింగ్ టీమ్‌తో టీడీపీకి ఈసారి ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..