Pithapuram Politics: ఫ్యాన్ జోరు సరే.. సిట్టింగ్ ఎమ్మెల్యే సైడ్‌లైన్ కావడం దేనికి సంకేతం?
ఉభయగోదావరి జిల్లాల వైసీపీ రీజినల్ కో - ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి అధ్వర్యంలో పి.గన్నవరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డుమ్మా కొట్టడం చర్చగా మారింది. పి.గన్నవరం ఇంచార్జ్‌గా విప్పర్తి వేణుగోపాల్‌ను నియమించడంతో చిట్టిబాబు అసంతృప్తిగా వున్నారు.

అధికార పార్టీ వైసీపీ వ్యూహం వర్కవుటయింది. ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు లైన్ క్లియరైంది. అదీ ఎలాంటి టికెట్ శించకుండా. అన్‌కండీషనల్‌గా వైసీపీ పార్టీలో చేరుతున్నట్లు ముద్రగడతో పాటు ఆయన కుమారుడు ప్రకటించేశారు. ఇక, పిఠాపురంలో గెలుపు తమదేనంటున్నారు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వంగా గీతా. ఇక్కడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగినా సరే ప్రజల మద్దతు వైసీపీకే అని వంగా గీతా ధీమా వ్యక్తం చేశారు.
అటు ఉభయగోదావరి జిల్లాల వైసీపీ రీజినల్ కో – ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి అధ్వర్యంలో పి.గన్నవరంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డుమ్మా కొట్టడం చర్చగా మారింది. పి.గన్నవరం ఇంచార్జ్‌గా విప్పర్తి వేణుగోపాల్‌ను నియమించడంతో చిట్టిబాబు అసంతృప్తిగా వున్నారు.
ఈ సందర్భంగా విజయవాడ చుట్టూ తిరిగితే పదవులు రావన్నారు సీపీ రీజినల్ కో – ఆర్డినేటర్ మిథున్ రెడ్డి. కష్టపడ్డవాళ్లకి వైసీపీ తప్పక గుర్తింపు వుంటుందన్నారు. మంత్రి పి. విశ్వరూప్, ఎంపీ చింతా అనూరాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే పొన్నాడా సతీష్ సహా వైసీపీ నేతలంతా సమావేశానికి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు గైర్హాజరు దేనికి సంకేతమనే చర్చ జోరందుకుంది. పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు మరో పార్టీలోకి వెళ్తారా..? వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నదీ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




