Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmangari Math : బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు..? ఆలయ కుటుంబీకుల మధ్య గొడవలు.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ

Brahmangari Math : నెల రోజుల కిందట శ్రీ పోతులూరు వీర బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి శ్రీ వీర బోగ వసంత వెంకటేశ్వర స్వామి

Brahmangari Math : బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు..? ఆలయ కుటుంబీకుల మధ్య గొడవలు.. రంగంలోకి దిగిన దేవాదాయ శాఖ
Brahmangari Math
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: May 28, 2021 | 7:23 AM

Brahmangari Math : నెల రోజుల కిందట శ్రీ పోతులూరు వీర బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి శ్రీ వీర బోగ వసంత వెంకటేశ్వర స్వామి చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో పీఠాధిపతి ఎవరు అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. పీఠాధిపతి కోసం వెంకటేశ్వర స్వామి కుటుంబీకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాలజ్ఞానం రాసిన శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా కందిమల్లాయ పల్లెలో జీవ సమాధి అయ్యారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం బ్రహ్మంగారి మఠంగా వెలుగొందుతుంది. అక్కడే స్థానికులు ఆయనకు ఆలయం నిర్మించారు. బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కుటుంబీకులు ఉంటున్నారు. ఇప్పటి వరకు ఏడు తరాలు వారు పీఠాధిపతులుగా వ్యవహరించారు.

ఇటీవల చనిపోయిన పీఠాధిపతి శ్రీ వీర బోగ వసంత వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి 8 మంది సంతానం వారిలో నలుగురు కొడుకులు, నలుగురు కూతురులు. మొదటి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో వెంకటేశ్వరస్వామి రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అయితే స్వామి వీలునామాలో మొదటి భార్యకి చెందిన రెండో కొడుకు, రెండో భార్యకి చెందిన ఒక కొడుకు పేరును రాసారు. ఇద్దరిపేర్లు రాయడంతో ఎవరు పీఠాధిపతి అనే విషయంలో వివాదం నెలకొంది. దీంతో దేవాదాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

కొత్త మఠాధిపతిని ఎంపిక చేసేందుకు వచ్చిన దేవాదాయ శాఖ ఉప కమిషనర్ రాణా ప్రతాప్ స్వామి వారి కుటుంబం సభ్యులు, స్థానికులతో బహిరంగ విచారణ చేశారు. తనకే పీఠం ఇవ్వాలన్న పెద్ద భార్య కొడుకు వెంకటాద్రి స్వామి. లేదు నా పేరు ఉంది నాకే కావాలన్న పెద్ద భార్య రెండో కొడుకు. అయితే రెండో కొడుకుకు మెజార్టీ ప్రజలు మద్దతు తెలిపారు. కొడుకు చిన్నవాడు కావడంతో మఠాధిపత్యం నేనే స్వీకరిస్తానని చిన్న భార్య మారుతమ్మ తెలిపింది. పెద్ద భార్య కొడుకు, రెండో కొడుకు, రెండో భార్య మారుతుమ్మ అభిప్రాయం తీసుకున్న అధికారులు గందరగోళంగా ఉండటంతో ఎంపికను వాయిదా వేసారు. దీంతో స్వామి కుటుంబీకులు రెండు వర్గాలుగా విడిపోయారు.

అయితే మొదటి భార్యకు కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు నలుగురు కొడుకులలో ఎవరైతే ఒక కిడ్నీ ఇస్తారో వాళ్ళకే తదుపరి పీఠాధిపతి ఇస్తామన్న తల్లి పేర్కొంది. అయితే ఆమె రెండో కొడుకు ముందుకు వచ్చి కిడ్నీ దానం చేశాడు. దీంతో వీలునామాలో అతని పేరే ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. అయితే పీఠాధిపతి కావాలంటే కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. 1. హిందు మతం, వేదాంత శాస్త్రంలో పరిజ్ఞానం 2. ధార్మిక గ్రంథాలు, మఠానికి సంప్రదాయము, పరిజ్ఞానం తెలిసుండాలి 3. మఠము శిష్యగణమునకు జ్ఞానబోధ, సంప్రదాయాలను నేర్పించే గుణం 4. క్రమశిక్షణ, నమ్మకంతో మత ప్రవృత్తి కలిగి వుండాలి.

ఈ అర్హతలు, లక్షణాలు కలిగి ఉన్న వారి పేరును దేవాదాయ శాఖ అధికారులు ధార్మిక పరిషత్ కు సూచిస్తారు. ఈ ధార్మిక పరిషత్ లో దేవాదాయ శాఖ కమిషనర్ తో పాటు నలుగురు సభ్యులు ఉంటారు. పేరు ప్రతిపాదించిన మూడు నెలల్లో ధార్మిక పరిషత్తు నిర్ణయం తీసుకుంటుంది. అనంతరం బ్రహ్మం గారి మఠ పీఠాధిపతి గా పేరును ప్రకటిస్తుంది. మొదటి భార్య కొడుకులో అర్హతలు, లక్షణాలు కనిపించడం లేదు. ఇక రెండో భార్య కొడుకు చిన్నవాడు, వయస్సు, అనుభవం లేదు. చిన్న భార్య వితంతు కనుక ఆమె అనర్హులురాలనే చర్చ జరుగుతుంది. పెద్ద భార్య పెద్ద కొడుకుకి అర్హతలు లేవు. ఫలితంగా బ్రహాంగారి మఠ పీఠాధిపతి ఎవరు అనే అంశం పై తర్జనభర్జన నెలకొంది. దీంతో పీఠాధిపతి ఎంపిక ఆలస్యం కానుంది.

National Green Tribunal: అనంతపురం కంకర మిషిన్ల యాజమాన్యాలకు బిగ్ షాక్ ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్..

Variety Marriage: అనంతపురంలో వింత ఆచారం.. పోటీ పడి మరీ పెళ్లి చేస్తామంటూ ముందుకొస్తున్న..

Fake Cowin Apps: వ్యాక్సీన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ ఫోన్లకు మెసేజ్‌లు.. ఓపెన్ చేశారో అంతే సంగతలు..