National Green Tribunal: అనంతపురం కంకర మిషిన్ల యాజమాన్యాలకు బిగ్ షాక్ ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్..
National Green Tribunal: అనంతపురంలో కంకర మిషిన్ల యాజమాన్యాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ జరిమానా విధించింది.
![National Green Tribunal: అనంతపురం కంకర మిషిన్ల యాజమాన్యాలకు బిగ్ షాక్ ఇచ్చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2021/05/national-green-tribunal.jpg?w=1280)
National Green Tribunal: అనంతపురంలో కంకర మిషిన్ల యాజమాన్యాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బిగ్ షాక్ ఇచ్చింది. భారీ జరిమానా విధించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా నేమెకల్లు కంకర మిషిన్ల కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ గురువారం నాడు తీర్పును వెలువరించింది. మొత్తం రూ. 1.15 కోట్ల అపరాధ రుసుం చెల్లించాలిన కంకర మిషిన్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా మొత్తం పెనాల్టీని కట్టాలని 19 కంకర మిషన్ల యాజమాన్యాలను నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నివారణ మండలి ఈ మొత్తం పెనాల్టీని వసూలు చేయాలని ఆదేశించింది. అలాగే కాలుష్య నియంత్రణ నిబంధనలకు లోబడే కంకర మిషిన్ల యాజమాన్యాలు పని చేయాలని గ్రీన్ ట్రిబ్యూనల్ ధర్మాసనం తేల్చి చెప్పింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటిస్తున్నారో, లేదో తనిఖీలు నిర్వహించి నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశించింది. కాగా, అనంతపురం జిల్లాలో నేమెకల్లు పరిధిలో గల క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతూ కాలుష్య కారకం అవుతున్నారని కె. హిరోజీ రావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటీషన్ దాఖలు చేశారు. 2018 నుంచి పలు దఫాలుగా తనిఖీలు జరిపించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ తాజాగా తీర్పును వెలువరించింది.
Also read:
Variety Marriage: అనంతపురంలో వింత ఆచారం.. పోటీ పడి మరీ పెళ్లి చేస్తామంటూ ముందుకొస్తున్న..