Ambergris: ఆన్‌లైన్‌లో అమ్మకానికి తిమింగలం వాంతి.. ఊహించని షాక్ ఇచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్లు..
Ambergris: తిమింగలం వాంతిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ముఠా ఆట కట్టించారు చెన్నై, వినుకొండ అటవీశాఖ అధికారులు.
Ambergris: తిమింగలం ‘వాంతి’ ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన ముఠా ఆట కట్టించారు చెన్నై, వినుకొండ అటవీశాఖ అధికారులు. ఈ ముఠా వేసిన ప్లాన్ రూట్‌లోనే వెళ్లి వారికి ఊహించని ఝలక్ ఇచ్చారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన దాని ప్రకారం పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.
తిమింగలం వాంతికి అంతర్జాతీయ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ ముఠా.. తిమింగలం వాంతి(అంబర్‌గ్రిస్)ను ఏకంగా ఆన్‌లైన్‌లోనే విక్రయానికి పెట్టింది. గుంటూరు జిల్లాకు చెందిన ఎనిమది మంది ముఠా సభ్యులు తిమింగలం వాంతి(అంబర్ గ్రిస్) ను ఆన్‌లైన్‌లో బేరానికి పెట్టారు. అంబర్ గ్రీస్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లలో విపరీతమైన డిమాండ్ ఉంది. దాంతో ఈ బిజినెస్‌ని ఎంచుకున్నారు వీరు. అయితే, అంబర్ గ్రీస్ విక్రయం అటవీచట్టం ప్రకారం నేరం. దాంతో గుట్టచప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అంబర్ గ్రీస్‌ను ఆన్‌లైన్ లో బేరానికి పెట్టింది ముఠా. అయితే, ఈ ముఠా కదలికలను చెన్నైలోని అటవీశాఖ వన్యప్రాణి సంరక్షణ నేర నియంత్రణ విభాగం నిఘా పెట్టింది.
అంబర్ గ్రీస్‌ను విక్రయానికి పెట్టగా.. దానిని తామే కొనుగోలు చేస్తామని అధికారులు మారు రూపంలో నమ్మించారు. ఇందులో భాగంగా అధికారులు నరసరావుపేటకు వచ్చారు. దీనికి ముందు వీరు వినుకొండ అటవి శాఖ అధికారుల సహకారం తీసుకున్నారు. ఇలా అటవీ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పువ్వాడ ఆసుపత్రి వద్ద ముఠా సభ్యులు అంబర్ గ్రిస్ ను తీసుకురాగా.. వీరిని అదుపులోకి తీసుకున్నారు. 8 మందిని అరెస్ట్ అచేసిన అధికారులు.. వారి వద్ద నుంచి 8 కిలోల అంబర్ గ్రీస్ ను స్వాధీనం చేసుకకున్నారు. నిందితులను నరసరావుపేట కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం.. నిందితులకు రెండు వారాల రిమాండ్ విధించింది.
Also read: