Srisailam Temple: డ్రోన్లు ఇలా చక్కర్లు కొట్టి అలా మాయం అవుతున్నాయి.. శ్రీశైలంలో అసలేం జరుగుతోంది?..

Srisailam Temple: శ్రీశైలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్థరాత్రి డ్రోన్ల చక్కర్లు దేనికి సంకేతం? మిణుకు మిణుకు మంటూ చక్కర్లు..

Srisailam Temple: డ్రోన్లు ఇలా చక్కర్లు కొట్టి అలా మాయం అవుతున్నాయి.. శ్రీశైలంలో అసలేం జరుగుతోంది?..
Srisailam
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 05, 2021 | 11:52 AM

Srisailam Temple: శ్రీశైలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అర్థరాత్రి డ్రోన్ల చక్కర్లు దేనికి సంకేతం? మిణుకు మిణుకు మంటూ చక్కర్లు కొడుతున్న డ్రోన్లు క్యాప్చర్ చేస్తున్నదేంటి? నైట్‌ విజన్ కెమెరాలు అమర్చారా? టెంపుల్‌ టార్గెట్‌గా ఏమైనా చక్కర్లు కొడుతున్నాయా? లేదంటే డ్యామ్‌పై తిరుగాడాయా? తెలుగురాష్ట్రాల మధ్య జల జగడం పీక్‌కి వెళ్లిన వేళ.. ఈ డ్రోన్ వ్యవహారం మిస్టరీగా మారింది.

దేశ సరిహద్దులకు అవతల ఇప్పటికే డ్రోన్ల కలకలం కలవరపెడుతోంది. అదే సమయంలో శ్రీశైలంలో, నల్లమల అటవీప్రాంతంలో అదీ టెంపుల్‌ పరిసరాల్లో.. దానికి ఆనుకుని ఉన్న డ్యామ్‌పై డ్రోన్లు తిరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఈ డ్రోన్లకు నైట్ విజన్ కెమెరాలు అమర్చారా? ఆ నైట్ విజన్ కెమెరాలతో జరిగిన రెక్కీ ఏంటి? అధికారికంగా తిరిగిన డ్రోన్లు అయితే ఈ పాటికే అందుకు సంబంధించిన సమాచారం రావాలి. రాలేదు సరికదా.. అర్థరాత్రి చక్కర్లు కొట్టిన ఈ డ్రోన్‌లను పట్టుకోడానికి టెంపుల్ సింబ్బంది చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఒక చోట డ్రోన్లు ఎగరవేయాలీ అంటే ఆ దరిదాపుల్లోనే దాని ఆపరేటర్ ఉండి ఉండాలి. కానీ చుట్టుపక్కన ఎవరూ కనిపించడం లేదు. మరి ఆ డ్రోన్స్ ఎగురవేసిందెవరు? ఏ టార్గెట్‌గా డ్రోన్‌లు ఎగరవేశారన్నది అంతుపట్టడం లేదు.

నాలుగురోజులుగా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. లెటెస్ట్‌గా మూడు నాలుగు నిమిషాల పాటు డ్రోన్లు మళ్లీ చక్కర్లు కొట్టాయి. టెంపుల్, ప్రాజెక్టు పరిసర ప్రాంతాల మీదుగా డ్రోన్ తిరుగాడింది. దీనిపై ఆలయ ఈవో రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రోన్ ఎవరు ఎగురవేశారనే దానిపై నిగ్గు తేల్చాలని ఈవో రామారావు పోలీసులను కోరారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీశైల క్షేత్రానికి చుట్టూ ఐదు కిలోమీటర్ల మేర జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల లాడ్జ్‌లలో దిగిన వారిని, అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. సమీప ప్రాంతాలలో ఎవరెవరికి డ్రోన్ కెమెరాలకు అనుమతులు ఉన్నాయి అనేదానిపై లిస్ట్ సేకరించి, వారి గురించి ఆరా తీస్తున్నారు. కాగా, శ్రీశైల క్షేత్రానికి, శ్రీశైలం రిజర్వాయర్‌కు ముప్పు ఉందంటూ గతంలోనే నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా డ్రోన్స్ చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

ఇంకా విచిత్రమేంటంటే.. రెండు రాష్ట్రాల మధయ వివాదాల నేపథ్యంలో రిజర్వాయర్ దగ్గర రెండు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భంలో నాలుగు రోజులుగా అర్థరాత్రి వేళ డ్రోన్ కెమెరా తిరగడం సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంది. డ్రోన్ కెమెరా విషయాన్ని తేల్చాలని స్థానిక అధికారులను ఆదేశించింది. అర్ధరాత్రి వేళ అడవిలో సినిమా షూటింగ్ లేదా సీరియల్ చిత్రీకరణ కోసమా.. అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Also read:

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.. తిన్నారో ఇక అంతే సంగతులు..

Myanmar: మయన్మార్ లో మరోసారి సైనికులు, ఉద్యమకారుల మధ్య ఘర్షణ..25 మంది మృతి

SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్‌ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!