Myanmar: మయన్మార్ లో మరోసారి సైనికులు, ఉద్యమకారుల మధ్య ఘర్షణ..25 మంది మృతి
మయన్మార్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు ఆయుధాలు చేతబట్టుకుని సైనికులపై తిరగబడుతున్నారు.
మయన్మార్ లో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంటోంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలు ఆయుధాలు చేతబట్టుకుని సైనికులపై తిరగబడుతున్నారు. తాజాగా రాజధాని నెపిడాకు సుమారు 300 కి.మీ. దూరంలోని డెపాయిన్ టౌన్ లో శుక్రవారం సైనికులు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్శణలో 25 మంది మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ‘సాయుధులైన టెర్రరిస్టులు’ అక్కడ గస్తీ తిరుగుతున్న సైనికులపై ఒక్కసారిగా దాడి చేశారని, ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించగా ఆరుగురు గాయపడ్డారని ప్రభుత్వ ఆధీనంలోని ‘గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్’ పత్రిక తెలిపింది. దేశంలో మిలిటరీ పాలనను వ్యతిరేకిస్తున్నవారు ‘పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సెస్’ పేరిట తామే ఓ సంస్థను ఏర్పాటు చేసుకుని స్వయంగా రైఫిల్స్ వంటి ఆయుధాలను తయారు చేసుకుంటున్నారు. దేశంలో పలు చోట్ల ఈ సంస్థ సభ్యులు సైనికులపై దాడులకు పాల్పడుతున్నారని ఈ పత్రిక పేర్కొంది.
అయితే స్థానికుల కథనం మరోలా ఉంది. ఈ టౌన్ లో నాలుగు సైనిక ట్రక్కుల్లో వచ్చిన సాయుధ దళాలు..నిర్దాక్షిణ్యంగా..విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని ..చివరకు రోడ్డున ఎవరు కనిపిస్తే వారిపై కూడా ఫైర్ చేశారని తీవ్ర గాయాలకు గురైన ఓ వ్యక్తి తెలిపాడు. ఈ ఘటనలో తన సమీప బంధువు మరణించినట్టు ఆయన చెప్పాడు. సైనికులు కొందరి తలలపై రైఫిల్ ఆనించి ఫైర్ చేశారన్నాడు. కాల్పుల అనంతరం 25 మృతదేహాలను కనుగొన్నారు. కాగా డెసాయిన్ పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం..తమ సభ్యుల్లో 18 మంది మరణించారని. 11 మందికి పైగా గాయపడ్డారని తన ఫేస్ బుక్ లో తెలిపింది. గత ఫిబ్రవరిలో కుట్ర చేసి మిలిటరీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన హింసాత్మక ఘటనల్లో సుమారు వెయ్యి మంది మరణించారని..అనేకమంది గాయపడ్డారని అంచనా..
మరిన్ని ఇక్కడ చూడండి: SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లు తస్మాత్ జాగ్రత్త.. వారికి ఆ వివరాలు చెప్పవద్దని హెచ్చరించిన ఎస్‌బీఐ..!
Whitener addiction: మత్తు బానిసలకు మరో అవకాశం.. హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయోగం..!?