ఆంక్షలు ఎత్తేస్తాం.. కోవిద్ వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోండి.. ప్రజలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హితవు
బ్రిటన్ ప్రజలు కోవిద్ వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ హితవు చెప్పారు. ఈ నెల 19 నుంచి దేశంలో కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తివేయడానికి అనువుగా ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ను ఆయన ప్రకటించనున్నారు.
బ్రిటన్ ప్రజలు కోవిద్ వైరస్ తో కలిసి జీవించడం నేర్చుకోవాలని ప్రధాని బోరిస్ జాన్సన్ హితవు చెప్పారు. ఈ నెల 19 నుంచి దేశంలో కరోనా వైరస్ ఆంక్షలను ఎత్తివేయడానికి అనువుగా ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ను ఆయన ప్రకటించనున్నారు. అయితే దీనికి ముందుగా.. ప్రజలు ఈ వైరస్ కి అలవాటు పడాలని వ్యాఖ్యానించారు. నిజానికి గత నెల 21 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉండగా ఒక్కసారిగా కోవిద్ కేసులు పెరిగిపోవడంతో తిరిగి వీటిని కొనసాగించారు. డెల్టా వేరియంట్ కారణంగా ముఖ్యంగా ఇంగ్లండ్ వంటి నగరాల్లో కేసులు పెరిగిపోవడం గమనార్హం. ఆంక్షలను ఎత్తివేస్తే ఇవి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే చాలామంది ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆసుపత్రుల పాలు కావడం తగ్గిందని..ఆలాగే మరణాల సంఖ్య కూడా తగ్గడం గమనించామని ప్రభుత్వం చెబుతోంది. కానీ బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ మాత్రం..కనీసం కొన్ని ఆంక్షలనైనా అమలు చేయాలని సూచిస్తోంది. కొన్ని నగరాల్లో రోజుకు 30 వేలకు పైగా కేసులు నమోదవుతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది.
ఇలాగే మాస్కుల సడలింపు విషయంలో కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీని పలువురు విద్యావేత్తలు ఖండిస్తున్నారు. వీటి ధారణను ప్రజల ఇష్టాయిష్టాలకు వదిలివేయడం సబబు కాదంటున్నారు. మన బిహేవియర్ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని స్టీఫెన్ రిఛర్ అనే ప్రొఫెసర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే చాలామంది మాస్కులు ధరించడం మానివేశారని, ఇది ప్రయోజనం కన్నా నష్టానికే దారి తీస్తుందని ఆయన చెప్పారు. వైరస్ ని పూర్తిగా నిర్మూలించేంతవరకు కొన్ని ఆంక్షలను కొనసాగించాలన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? క్యారెట్ అంటే ఏమిటి..?
Viral Video: మట్టిలో తెగ ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు.. ముచ్చటేస్తున్న వీడియోకు నెటిజన్లు ఫిదా..