Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? క్యారెట్‌ అంటే ఏమిటి..?

Gold Carats: బంగారంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ రెండింటికి తేడాలు ఏమిటో బంగారం కొనుగోలు చేసేవారికి ఎక్కువగా తెలుస్తుంటుంది..

Gold Carats: 24 క్యారెట్ల బంగారం.. 22 క్యారెట్ల బంగారానికి తేడా ఏమిటి..? క్యారెట్‌ అంటే ఏమిటి..?
Follow us

|

Updated on: Jul 05, 2021 | 10:00 AM

Gold Carats: బంగారంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ రెండింటికి తేడాలు ఏమిటో బంగారం కొనుగోలు చేసేవారికి ఎక్కువగా తెలుస్తుంటుంది. కానీ కొందరికి మాత్రం ఈ క్యారెట్ల విషయంలో చాలా అనుమానాలుంటాయి. క్యారెట్‌ అనేది స్వచ్ఛతకు నిదర్శనం. క్యారెట్‌ వాల్యూ పెరిగే కొద్ది బంగారం స్వచ్ఛత పెరుగుతుంది. ఫలితంగా ధర కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారం స్వచ్ఛతను 0 నుంచి 24 వరకు లెక్కిస్తారు. అయితే పసిడి ఎంతో సున్నితమైనది. దీనికి రాగి, నికెల్, వెండి, పల్లాడియం లాంటి లోహాలు కలిస్తే బలపడి ఆభరణాలు చేయడం సాధ్యపడుతుంది. బంగారం, ఇతర లోహాల మిశ్రమాలు ఏ మోతాదులో కలిశాయనేది కూడా క్యారెట్‌ తెలుపుతుంది.

24 క్యారెట్ల బంగారం:

ఈ క్యారెట్‌లో బంగారం 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇందులో ఇతర లోహాలేవీ ఉండవు. 24 క్యారెట్ల బంగారానికి మించిన బంగారం ఉండదు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారంతో పోలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ఖరీదైనది. ఈ బంగారు సున్నితమైనది. ఇందులో ఏ ఇతర లోహం కలిసి ఉండదు. కేవలం బంగారమే ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం అని చెబితే అందులో 99.99 శాతం బంగారమే ఉంటుందని గుర్తించాలి. దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు. 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉంటుంది. అయితే ఈ క్యారెట్‌లో 100 శాతం బంగారం ఉండవచ్చు కదా.. అని అనుమానం రావచ్చు.అయితే 100 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద చాలా మృదువుగా, పెళుసుగా ఉంటుంది. ఒక ఆకారంలోఉండదు. అందుకే బంగారాన్ని వెలికి తీసిన తర్వాత 99.99శాతం స్వచ్ఛత వచ్చే విధంగా చేస్తారు. ఇదే అత్యంత స్వచ్ఛమైన బంగారమని భావించాలి.

22 క్యారెట్ల బంగారం:

ఈ క్యారెట్ల బంగారంలో రెండొంతుల్లో రాగి, జింక్ లాంటి మెటల్స్ ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం కంటే ఇది హార్డ్‌గా ఉంటుంది. ఆభరణాల తయారీకి ఇది అనువైంది. ఇది 91.6 శాతం స్వచ్ఛమైన బంగారం. ఈ బంగారాన్ని 916 బంగారం అని కూడా పిలుస్తుంటారు. ఈ బంగారానికి ఇతర లోహాలు కలపడం వల్ల గట్టి పడుతుంది.

18 క్యారెట్ల బంగారం:

18 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. ఇందులో ఉండే బంగారంలో ఆరు భాగాల ఇతర మెటల్స్ ఉంటాయి. దీనిని 750 బంగారం అని కూడా పిలుస్తుంటారు.18 క్యారెట్ల బంగారంలో 75 శాతం పసిడి, 25 శాతం జింక్, రాగి, నికెల్ లాంటి లోహాలు ఉంటాయి. 24, 22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత హార్డ్‌గా, మన్నికగా ఉంటుంది. ఇన్వెస్ట్‌ మెంట్‌ కోసం అయితే 24 క్యారెట్ల బంగారం వైపు మొగ్గు చూపుతుంటారు. డైమండ్‌ జువెలరీ తయారీలో 18కే బంగారం ఎక్కువగా వాడతారు. 18 క్యారెట్ల బంగారం కన్నా 22 క్యారెట్ల బంగారం ధర ఎక్కువగా ఉంటుంది.

14 క్యారెట్ల బంగారం:

ఈ క్యారెట్‌ బంగారంలో 58.3 శాతం గోల్డ్, 41.7 శాతం ఇతర మెటల్స్ ఉంటాయి. దీనికి మన్నిక ఎక్కువ కానీ ధర తక్కువ ఉంటుంది. మార్కెట్లో 10 క్యారెట్లు, 9 క్యారెట్ల బంగారం కూడా లభ్యం అవుతుంది. బంగారం స్వచ్ఛతను ఫైన్‌నెస్, దాని రంగును బట్టి గుర్తించవచ్చు. 24 క్యారెట్ల బంగారం మెరుస్తూ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం మెరుపు కాస్త తక్కువగా ఉండటంతోపాటు డార్కిష్‌గా ఉంటుంది. ఇతర లోహాలు కలిసేకొద్దీ బంగారం రంగు మారుతుంది. వైట్ గోల్డ్‌లో నికెల్ ఎక్కువగా ఉంటుంది.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..