AP Rains: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాలకు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. తాజాగా తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర దిశగా కదులతూ వాయుగుండంగా మారింది. ఈ క్రమంలోనే రాగల 24 గంటల్లో..

AP Rains: మరో బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ ప్రాంతాలకు నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు
Andhra Weather
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 20, 2024 | 8:56 PM

పశ్చిమ మధ్య దాని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కేంద్రీకృతమైంది. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి.. విశాఖకు 450 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఆ తర్వాత, ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ, తదుపరి 24 గంటలలో తీవ్ర వాయుగుండంగా కొనసాగిస్తుంది. దీని ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏయే ప్రాంతాల్లో ఇప్పుడు చూద్దాం..

డిసెంబర్ 21న, శనివారం:

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

అలాగే రాగల 24 గంటల్లో కాకినాడ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ, మన్యం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, గడిచిన 24 గంటలలో విజయనగరం జిల్లా మెంటాడలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.. ఏపీకి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు.? ఏ రూట్‌లోనంటే.!

చలికాలంలో పరగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో పరగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా
బోల్డ్ సిరీస్‌తో కవ్వించిన ఈ టాలీవుడ్ భామ ఎవరో తెల్సా
సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!
సిగరెట్‌లతో పాటు ఇవి మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న జీఎస్టీ!
బాహుబలి రికార్డ్‌ను బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి..
బాహుబలి రికార్డ్‌ను బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి..
ఈ గింజలు గుప్పెడు తిన్నారంటే.. చేపలు కంటే పదిరెట్లు మేలు చేస్తాయ్
ఈ గింజలు గుప్పెడు తిన్నారంటే.. చేపలు కంటే పదిరెట్లు మేలు చేస్తాయ్
శబరిమలలో మండల పూజకి ముందు జరిగే తంగా అంగీ యాత్ర గురించి తెలుసా
శబరిమలలో మండల పూజకి ముందు జరిగే తంగా అంగీ యాత్ర గురించి తెలుసా
మాజీ మంత్రి కేటీఆర్‌పై మరో కేసు నమోదు..!
మాజీ మంత్రి కేటీఆర్‌పై మరో కేసు నమోదు..!
మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇస్తారో లేదో.. ఈ విలువలు నేర్పండి చాలు!
మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇస్తారో లేదో.. ఈ విలువలు నేర్పండి చాలు!
శీతాకాలంలో ఒంట్లో చలిని తరిమేసే సూపర్‌ స్నాక్స్‌..
శీతాకాలంలో ఒంట్లో చలిని తరిమేసే సూపర్‌ స్నాక్స్‌..
ఆ రాశుల వారికి ‘మాలవ్య’ యోగం! వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ రాశుల వారికి ‘మాలవ్య’ యోగం! వారికి పట్టిందల్లా బంగారమే..