Weekend Hour: అనపర్తి ఘటనపై రాజకీయ ప్రకంపనలు.. టీడీపీ, వైసీపీల మధ్య మాటలయుద్ధం..
చంద్రబాబు నాయుడు అనపర్తి పర్యటనలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.
చంద్రబాబు నాయుడు అనపర్తి పర్యటనలో తలెత్తిన ఉద్రిక్తతలు ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని టీడీపీ అధినేత అంటే.. చట్టాన్ని అతిక్రమించిన చంద్రబాబు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నిరసనలకు పిలుపునిస్తే.. అటు చంద్రబాబు సహా పలువురిపై బిక్కవోలులో కేసులు నమోదయ్యాయి. బిక్కవోలు పీఎస్‌లో పలు సెక్షన్ల కింద చంద్రబాబు సహా ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.
అనపర్తి ఘటనలపై టీడీపీ, వైసీపీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఆనాడు మహాత్మాగాంధీ బ్రిటీష్ వారిపై దండి యాత్ర చేసినట్లుగానే నిన్న అనపర్తిలో తన యాత్ర జరిగిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలీసులు రాజ్యాంగ వ్యతిరేకంగా పని చేస్తే సహాయ నిరాకరణ తప్పదని హెచ్చరించారు. నిన్న అనపర్తి ఘటనల్లో గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు చంద్రబాబు.
నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చంద్రబాబుకు సూచించారు ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్. రోడ్లపై బహిరంగ సభలకు అనుమతి లేదని తెలిసినా కావాలని రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. రాజ్యాంగాన్ని, జీవోనెంబర్1 అందరికీ వర్తిస్తుందని.. చంద్రబాబు అతీతం కాదన్నారు మంత్రులు.
అటు డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో బిక్కవోలు పీఎస్‌లో చంద్రబాబుతో సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదుచేశారు పోలీసులు. రోడ్ల మధ్యలో బహిరంగ సభలు పెట్టకూడదన్న నిబంధలున్నా.. పట్టించుకోలేదన్నారు. సెక్షన్ 143, 353, 149, 188 కింద కేసు నమోదు చేశారు.
అయితే అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వైసీపీకి మైనస్సేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. మొత్తానికి పోలీసులను టార్గెట్ చేశారు తెలుగుదేశం నాయకులు.. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారని అధికారులంటున్నారు. ఇంతకీ ఘటనలో నిజానిజాలెలా ఉన్నా.. ఎవరికి వారు రాజకీయకోణంలో లాభనష్టాలు లెక్కలేసుకుంటున్నారా?
వీడియో చూడండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం.