YS Jagan: పాతపాటి సర్రాజు భౌతికకాయానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు..

గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు.

YS Jagan: పాతపాటి సర్రాజు భౌతికకాయానికి సీఎం వైఎస్ జగన్ నివాళులు..
Ys Jagan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 18, 2023 | 8:06 PM

గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. ఈరోజు మధ్మాహ్నం పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాటి సర్రాజు నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌.. సర్రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. పాతపాటి సర్రాజు మరణవార్త తెలిసిన వెంటనే ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌.. ఆపై వెంటనే ఆయన స్వగ్రామానికి చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్బంగా సర్రాజు కుటుంబసభ్యులను ఓదార్చారు.

1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్‌ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. 17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా ఉన్న సర్రాజు ఈరోజు తుదిశ్వాస విడిచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం.