Andhra Pradesh: పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో విషాదం.. గోదావరిలో ముగ్గురు గల్లంతు..
మహా శివరాత్రి పండుగ రోజున ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లిన ముగ్గురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు.
మహా శివరాత్రి పండుగ రోజున ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లిన ముగ్గురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు ముందుగా పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగారు. ఈ క్రమంలో ముగ్గురు గల్లంతయినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం పట్టిసీమ వద్ద ఉన్న శివాలయాన్ని దర్శించుకునేందుకు ముగ్గురు యువకులు వెళ్లారు. అక్కడ స్నానాలు చేసేందుకు వారు గోదావరి నదిలో దిగారు. ఈ క్రమంలో నది ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు స్థానికులు వెల్లడించారు.
స్థానికుల సమాచారంతో పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లికి చెందిన వాని పేర్కొంటున్నారు.
గల్లంతైన వారి కసం రెస్క్యూ బృందాలు సైతం రంగంలోకి దాగాయి. నది ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..