Eluru: ఆ చెరువులో దొరికినవారికి దొరికినన్ని చేపలు.. కుప్పలుగా తెచ్చి.. కట్ చేస్తే!
ఆ ఊరు ఊరంతా ఏకమయ్యారు. వలలు, గేలాలు పట్టుకొని చెరువు వద్దకు పరుగు తీశారు. అంతా ఒక్కసారిగా చెరువులో దిగారు..
ఆ ఊరు ఊరంతా ఏకమయ్యారు. వలలు, గేలాలు పట్టుకొని చెరువు వద్దకు పరుగు తీశారు. అంతా ఒక్కసారిగా చెరువులో దిగారు.. ఆగండి కంగారు పడకండి.. వాళ్లు చెరువులో దిగింది మరెందుకో కాదు.. చేపల కోసం.. అవును ఆ గ్రామంలో ఓ కట్టుబాటు ఉంది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గుండుగూడెం గిరిజన గ్రామస్తులు అంతా కలిసి ఒకేసారి వేటకు వెళ్తారు. అందరూ వలలు వేసి చేపలు పడతారు. అయితే ఇక్కడ చేపలు దొరికినవారికి దొరికినంత అన్నట్టు ఉండదు.. ఎవరి వలలో చేపలు పడినా, పడకపోయినా వారికి వచ్చిన ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే ఆ గ్రామస్తులంతా కలిసి చేపలు పడతారు. పడిన చేపలన్నీ ఒకచోట కుప్పగా వేసి అందరూ సమంగా పంచుకుంటారు. అనంతరం వాటిని అమ్ముకుంటారు. ఇక్కడ మాత్రం ఎవరి సేల్స్ వాళ్లవేనండోయ్. అయితే, ఈ గిరిజనుల కట్టుబాటుకు నెటిజన్లు ఫిదా అవున్నారు. వారి ఐకమత్యానికి ముగ్ధులవుతున్నారు.