Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandamuri TarakaRatna: ‘యువగళం’ పాదయాత్రకు బ్రేక్.. ఆ గొంతు ఇక లేదంటూ నారా లోకేష్ ట్వీట్..

నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో టీడీపీ యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రకు బ్రేక్. తార‌క‌ర‌త్నకు నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు.

Nandamuri TarakaRatna: 'యువగళం' పాదయాత్రకు బ్రేక్.. ఆ గొంతు ఇక లేదంటూ నారా లోకేష్ ట్వీట్..
Nara Lokesh, Tarakaratna
Follow us
Venkata Chari

|

Updated on: Feb 18, 2023 | 10:53 PM

నందమూరి తారకరత్న ఇక లేరు. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. జనవరి 27న లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తారకరత్న కూడా హాజరయ్యారు. కుప్పంలో పాదయాత్ర మొదలైన కాసేపటికి ఆయన నడుస్తూనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలకు తీసుకెళ్లి వైద్యం అందించారు. అయితే రెండ్రోజులుగా ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. ఈరోజు ఆయన తుదిశ్వాస విడిచారు.

నారా లోకేష్ ‘యువ‌గ‌ళం’ పాద‌యాత్రకు బ్రేక్..

నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతితో టీడీపీ యువ‌నేత నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్రకు బ్రేక్. తార‌క‌ర‌త్నకు నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైద‌రాబాద్ బ‌య‌లుదేరనున్నారు.

బావ అంటూ ఆప్యాయంగా పిలిచే గొంతు ఇక లేదంటూ ట్వీట్..

తారకరత్న మరణంతో నారా లోకోష్ కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో కన్నీటి నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు.’బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్కలమైన నీ ప్రేమ‌, స్నేహ బంధం మ‌న బంధుత్వం కంటే గొప్పది. తార‌క‌ర‌త్నకు క‌న్నీటి నివాళులతో..’ అంటూ రాసుకొచ్చారు.

సోమవారం అంత్యక్రియలు..

తారకరత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. ఎల్లుండి (సోమవారం) ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు. ఈ రోజు రాత్రి 11.30 గంటలకు నారాయణ హృదయాలయ నుంచి తారకరత్నను కుటుంబసభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు.