Rain Alert: ఇక దబిడి దిబిడే.. 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక లేటెస్ట్‌గా వచ్చిన వెదర్ అప్డేట్ ఏంటంటే.. మరో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో దబిడి దిబిడే అంటోంది వాతావరణశాఖ.
బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం ఏర్పడింది. తెలుగురాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తబోతున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక లేటెస్ట్‌గా వచ్చిన వెదర్ అప్డేట్ ఏంటంటే.. మరో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో దబిడి దిబిడే అంటోంది వాతావరణశాఖ. ఒడిశా తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రికృతమై ఉంది. మరోవైపు నైరుతిరుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయనీ.. ఒకటి రెండు చోట్ల అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే వారంపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనావేశారు..
ఇక ఏపీ విషయానికొస్తే.. ఐఎండి సూచనల ప్రకారం విదర్భకు ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. దీని ప్రభావంతో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, గురు,శుక్రవారాల్లో రెండు మూడుచోట్ల అతిభారీ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
రానున్న నాలుగు రోజుల వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వివరించారు.
17 జూలై, బుధవారం : శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, అనకాపల్లి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
18 జూలై, గురువారం: అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
19 జూలై, శుక్రవారం : అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
20 జూలై, శనివారం : శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..