AP Rains: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తుఫాన్‌గా మారే అవకాశం.. 3 రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..
దక్షిణ బంగ్లాదేశ్ దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇపుడు బలహీన పడింది. దీంతో అక్కడ్నించి వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుపానుగా మారుతుందని ఐఎండీ వివరించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం లో తూర్పు , ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు.

దక్షిణ అండమాన్ సముద్రం దానికి ఆనుకుని ఉన్న మలక్కా జలసంధి మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఈరోజు నవంబర్ 28వ తేదీ ఉదయం 0830 గంటలకు దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా పశ్చిమ దిశగా పయనించింది. ఈ అల్పపీడనం నవంబర్ 30, 2023 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించింది.. అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
దక్షిణ బంగ్లాదేశ్ దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇపుడు బలహీన పడింది. అనంతరం ఇది వాయువ్య దిశగా కదిలి, మరింత బలపడి తదుపరి 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌పై అధికంగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణం లో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. దీంతో మూడు రోజులకు వాతావరణ సూచనలను వెల్లడించింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈరోజు, రేపు (నవంబర్ 29వ తేదీ) ఎల్లుండి (నవంబర్ 30వ తేదీ) మూడు రోజుల పాటు తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అవకాశం ఉంది. రేపు (నవంబర్ 29వ తేదీ) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (నవంబర్ 30వ తేదీ) కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు.. లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని పేర్కొంది.
రాయలసీమ లో ఈ రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. రేపు (నవంబర్ 29వ తేదీ) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి (నవంబర్ 30వ తేదీ) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..