AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Murder: గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే?

భార్యను పుట్టింటికి పంపి.. ప్రియురాలిని ఇంటికి పిలిపించుకొని ఓ నేవీ ఉద్యోగి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటనలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసిన తర్వాత ప్రియురాలి శరీర భాగాలను నిందితుడు ముక్కలుగా కట్‌చేసినట్టు గుర్తించిన పోలీసులు.. తాజాగా మిస్సైన ఆమె తలను గుర్తించారు.

Vizag Murder: గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే?
Visakhapatnam Crime News
Anand T
|

Updated on: Mar 30, 2026 | 10:25 AM

Share

సోమవారం తెల్లవారుజామునే విషాఖలో దారుణ ఘటన వెలుగు చూసింది. గాజువాక LVనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రవీంద్ర అనే నేవి ఉద్యోగి తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో.. తన ప్రియురాలైన మౌనికను ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ మొదలై.. చినికి చినికి గాలివానగా మారి చివరకు హత్యకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు తెలిశాయి.

ప్రియురాలిని హత్య చేసేందుకు ముందుగానే రవీంద్ర ప్లాన్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అందుకోసం ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసి పెట్టుకున్నట్టు గుర్తించారు. అయితే అనుకున్న ప్రకారమే భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత ఆదివారం12:30- 1:00 మధ్యలో ప్రియురాలు మౌనికను రవీంద్ర ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలోనే మౌనికకు ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు రవీంద్ర. ఆ తర్వాత ఆనవాళ్లు లేకుండా చేయాలని ఆమె శరీర భాగాలను తల, రెండు చేతులు, మొండెం, నడుము, కాళ్లు ఇలా మొత్తం ఐదు ముక్కలుగా వేరు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, నడుము రెండు కాళ్లు భాగాన్ని సూట్ కేసులో పెట్టినట్టు గుర్తించారు.

అయితే ఇంట్లో తల భాగం కనిపించకపోవడంతో ఆరా తీయగా.. తల చేతులు మూటగట్టి అడవివరం ప్రాంతంలో దహనం చేసినట్టు నిందితుడు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య చేసిన తర్వాత రవీంద్ర తన స్నేహితుడు సందీప్‌కి సమాచారం ఇచ్చాడని.. దీంతో అప్రమత్తమైన స్నేహితుడు రవీంద్ర భార్యతో పాటు సోదరులకు సమాచారం ఇచ్చినట్టు పోలీసుగు గుర్తించారు. ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రవీంద్రను అరెస్ట్ చేశారు.

అయితే 2020 నుంచే మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 2023 లో మౌనికకు బ్రేకప్ చెప్పానని రవీంద్ర పోలీసులకు చెప్పినట్టు తెలిపారు. ఆ తర్వాత ఆమెకు పెళ్లైందని.. అయినప్పటికీ మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని.. అందుకే ఆమెను హత్య చేసినట్టు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే
గాజువాక హత్య కేసులో ట్విస్ట్.. తల భాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే
అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని సీక్రెట్స్
అడవిలో ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? ఎవ్వరు చెప్పని సీక్రెట్స్
అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు..
అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు..
శార్దూల్ ను ముంబైలోనే బంధించేయాలని ఫిక్స్ అయిపోయిన పాండ్యా
శార్దూల్ ను ముంబైలోనే బంధించేయాలని ఫిక్స్ అయిపోయిన పాండ్యా
అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన
అగ్గిపెట్టె కోసం అర్థరాత్రి యుద్ధం.. సీసీ కెమెరాలో రికార్డైన
రూ.1,47,760 జీతంతో ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
రూ.1,47,760 జీతంతో ఏపీ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత
బాత్రూంలో ఉప్పు పెడితే డబ్బులే డబ్బులు..వాస్తు శాస్త్ర రహస్యాలివే
బాత్రూంలో ఉప్పు పెడితే డబ్బులే డబ్బులు..వాస్తు శాస్త్ర రహస్యాలివే
బ్రోకలీ కర్రీ ఇలా చేస్తే.. తస్సాదియ్యా.. ఏ మాంసం కూరలు సరిపోవు
బ్రోకలీ కర్రీ ఇలా చేస్తే.. తస్సాదియ్యా.. ఏ మాంసం కూరలు సరిపోవు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అప్పటిలోపు చెల్లించిన వారికే 90% మాఫీ
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అప్పటిలోపు చెల్లించిన వారికే 90% మాఫీ
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!
బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!