AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Man Surya Bhai: బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్! మనోడి బిజినెస్‌ ఏంటో తెలుసా..

ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో జిగేల్‌మని మెరిసే గోల్డ్‌ మ్యాన్‌పై ఐటీ అధికారుల కన్ను పడింది. గోల్డ్ మ్యాన్‌గా పిలిచే సూర్యా భాయ్ ఎక్కడికెళ్లిన ఒంటి నిండా బంగారంతో కనువిందు చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఈ సూర్యా భాయ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాకు ఒంటి నిండా బంగారంతో కనిపించాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా అంత బంగారం ఒంటిపై ధరించి ఏమాత్రం భయం లేకుండా జనాల్లోకి వస్తున్న సూర్యాభాయ్‌తో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడుతుంటారు. బాబు చాలా రిచ్చని అందరూ అనుకునే వారు..

Gold Man Surya Bhai: బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్! మనోడి బిజినెస్‌ ఏంటో తెలుసా..
Hyderabad Gold Man
Srilakshmi C
|

Updated on: Mar 30, 2026 | 9:11 AM

Share

హైదరాబాద్‌, మార్చి 30: అసలే బంగారం ధరలు ముట్టుకుంటే సుర్రుమనేలా ఉంటే.. ఇతగాడు ఒంటి మీద కేజీలకు కేజీలు గోల్డ్‌ ఎలా ధరిస్తున్నాడో, అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీయగా అసలు గట్టు బయటపడింది. మెరిసేందంతా బంగారం కాదన్నట్లు మనోడి ఒంటిపై ఉన్న బంగారం కూడా అసలైంది కాదని తెలుసుకుని ఐటీ అధికారులు నాలుక కరచుకున్నారు. ఫేక్ గోల్డ్ మ్యాన్ అసలు పేరు పల్లాపు సురేష్ కుమార్ (34). హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన సూర్య భాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ధరించే నగల్లో మెరుపు తప్ప, అసలు బంగారం లేదని తేలింది.

హైదరాబాద్‌ శేరి లింగంపల్లికి చెందిన కొండా విజయ్‌ కుమార్‌ అలియాస్‌ బంగారు బాబు ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో అధికారులకు పట్టుబడ్డాడు. దర్యాప్తులో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులు రూ. 2.3 కోట్ల విలువైన 1.4 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొండా విజయ్‌ కుమార్‌ కేసులో సూర్యాభాయ్‌ గురించి సమాచారం ఐటీ అధికారులకు అందింది. అతడి సెల్‌ఫోన్‌లో సూర్యాభాయ్‌ ఫోన్‌ నంబర్, ఫొటోలు గుర్తించి హైదరాబాద్‌ ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐటీ విచారణకు హాజరైన సూర్యాభాయ్‌ సుమారు రూ.1 కోటి విలువైన 12 రకాల ఆభరణాలు ధరించి వచ్చాడు. ఈ క్రమంలో అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆభరణాలను పరీక్షించారు. దీంతో అతగాడు ధరించనవన్నీ రోల్డ్‌ గోల్డ్‌ అని, ఆ నగలు కేవలం రూ.3 లక్షల విలువైనవిగా తేల్చారు.

రాగి, వెండిపై గోల్డ్‌ కోటింగ్‌ వేసుకుని బంగారం అని ఫోజులు కొడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటివి దాదాపు 32 సెట్లు సూర్యాభాయ్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. కనీసం అతడికి సొంత ఇళ్లు కూడా లేదని, నెలకు రూ. 20,000 అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజమైన బంగారమని చెప్పుకుని ఈ నగలను ధరించి యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయిన సూర్యా భాయ్ అసలు బిజినెస్ చికెన్ షాప్. చికెన్ షాప్తో పాటు జిమ్ ట్రైనర్గా కూడా పని చేస్తుంటారు. ఇలా వచ్చిన డబ్బుతో నెలకు రూ.20 వేలు అద్దె కడుతూ లగ్జరీ లైఫ్ బతుకుతున్నాడు. ప్రమోషన్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, పలు చిన్న సినిమాల్లోనూ నటించి బాగానే కూడబెట్టాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ థార్, సఫారీ, ఎండీవర్, బుల్లెట్ మోటార్‌ బైక్‌లు కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..