Vizag: వీడు మాములోడు కాదు.. 11 మంది బాలికలతో ట్రైన్‌లో..

 విశాఖలో పెద్ద హ్యూమన్‌ ట్రాఫికింగ్‌.. రాకెట్‌ బయటపడింది. అన్నెం పున్నెం ఎరుగని అమాయక బాలికలు, యువతులను గపచుప్‌గా అక్రమరవాణా చేస్తోంది ఒక ముఠా. ఎన్నో కుటుంబాల్లో తీరనివ్యథ మిగిల్చిన ఈ హ్యూమస్‌ ట్రాఫికింగ్‌ను గుట్టును రట్టుచేశారు పోలీసులు. ఎక్స్‌ప్రెస్ రైల్లో తరలిస్తుండగా దాడులు చేసిన పోలీసులు 11 మంది బాలికలను రక్షించారు.

Vizag: వీడు మాములోడు కాదు.. 11 మంది బాలికలతో ట్రైన్‌లో..
Vizag Human Trafficking Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 21, 2024 | 1:39 PM

విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికలను అక్రమ రవాణా చేస్తున్న రాకెట్‌ను పట్టుకున్నారు. రైల్వేస్టేషన్‌లో బాలికల అక్రమ రవాణా గుర్తించిన పోలీసులు 11 మందిని రెస్క్యూ చేశారు. ఈ బాలికలను అక్రమంగా తరలిస్తున్న నిందితుడు రవికుమార్ బిసోయ్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. రైల్వే పోలీసులకు, ఇతర అధికారులకు.. ఇలా, ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల అక్రమ రవాణా చేస్తున్న విషయం బట్టబయలైంది. వీళ్లంతా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్, నేపాల్‌లోని మారుమూల ప్రాంతాలకు చెందిన బాలికలను పోలీసులు చెబుతున్నారు.

దీనికన్నా పెద్ద షాకింగ్‌ న్యూస్‌ ఏంటంటే, ఇప్పటి వరకు ఈ ముఠా 100 మందికి పైగా బాలికలను అక్రమ రవాణా చేసినట్లు తెలుస్తోంది. ఈ ముఠా తరలించిన వందమంది బాలికలు, యువతుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఎక్కడ, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఈ మొత్తం హ్యూమన్‌ ట్రాఫికింగ్‌పై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ కేసును ఒడిశా పోలీసులకు బదిలీ చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..