AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2024 Exam Schedule: యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే

జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీ పడేందుకు అర్హత సాధించే యూజీపీ నెట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా యమ డిమాండ్ ఇంటుంది. అందుకే ప్రతీయేట ఈ పరీక్షను రెండు సార్లు యూజీపీ నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ సెషన్ కు సంబంధించి పరీక్షల తేదీలను ఇప్పటికే యూజీపీ ప్రకటించింది. అయితే ఈ తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి..

UGC NET 2024 Exam Schedule: యూజీసీ నెట్‌ 2024 (డిసెంబర్‌) పరీక్షల తేదీలు మారాయోచ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
UGC NET 2024 Exam Schedule
Srilakshmi C
|

Updated on: Dec 20, 2024 | 2:28 PM

Share

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 (యూజీసీ- నెట్‌) పరీక్ష తేదీలు మారాయి. ఈ మేరకు మారిన పరీక్ష తేదీలతోపాటు పరీక్షల షెడ్యూల్‌ను యూజీసీ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఈ పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. అందుకే యేటా రెండు సార్లు యూజీసీ నెట్‌ పరీక్షలు నిర్వహిస్తుంది.

తాజా షెడ్యూల్‌ ప్రకారం జనవరి 3, 6, 7, 8, 9, 10, 15, 16 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది. కాగా యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ నవంబర్‌ 19 నుంచి డిసెంబర్‌ 10 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. త్వరలోనే అడ్మిట్‌ కార్డులను యూజీసీ విడుదల చేయనుంది.

కాగా యూజీసీ- నెట్‌ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. పేపర్‌ 1లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. పేపర్‌ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష 3 గంటల వ్యవధిలో ఉంటుంది. పేపర్‌-1లో రీజనింగ్‌ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్‌ థింకింగ్‌, జనరల్‌ అవేర్‌ననెస్‌ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇక పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజెస్‌ సబ్జెక్టులు మినహా మిగతా అన్ని సబ్జెక్టుల ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మీడియంలలో మాత్రమే ఉంటుంది.

ఇవి కూడా చదవండి

యూజీసీ- నెట్‌ 2024 డిసెంబర్‌ పరీక్షల షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..
పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే పల్లీలు అటుకుల లడ్డు..