Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: విశాఖ ఏజెన్సీకి కొత్త ఊపిరి.. అరకు లోయలో PM Cares Fundతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు

విశాఖ ఏజెన్సీలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ ప్రారంభమైంది. ఆక్సీజన్‌ సిలిండర్ల అవసరం లేకుండానే ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్‌ ప్రత్యేకత. అటు విశాఖలోని ఛాతి ఆసుపత్రిలో కూడా ఆక్సీజన్‌ ప్లాంట్‌ ప్రారంభమైంది.

Visakhapatnam: విశాఖ ఏజెన్సీకి కొత్త ఊపిరి.. అరకు లోయలో PM Cares Fundతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
Araku MP Goddeti Madhavi
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 08, 2021 | 1:44 PM

Visakhapatnam: విశాఖ ఏజెన్సీలో ఆక్సీజన్‌ ప్లాంట్‌ ప్రారంభమైంది. ఆక్సీజన్‌ సిలిండర్ల అవసరం లేకుండానే ఆక్సీజన్‌ను ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్‌ ప్రత్యేకత. అటు విశాఖలోని ఛాతి ఆసుపత్రిలో కూడా ఆక్సీజన్‌ ప్లాంట్‌ ప్రారంభమైంది. విశాఖ ఏజెన్సీలోని అరకులోయ ఏరియా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ఎంపీ గొడ్డేటి మాధవి ప్రారంభించారు.  ఏజెన్సీలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నిమిషానికి 200 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉంది. రూ.70 లక్షలతో ప్రధానమంత్రి కేర్స్ నిధులతో అరకులోయ ఏరియా ఆసుపత్రిలో దీన్ని నిర్మించారు. ఈ ప్లాంట్ ఏర్పాటు వల్ల అరకు లోయ ఏరియా ఆస్పత్రిలో 25 బెడ్స్‌కు ఆక్సిజన్ సౌకర్యం ఉంటుంది. ప్రెషర్ స్వింగ్ అడాప్షన్ విధానంలో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం లేకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ ప్రత్యేకత.

గిరిజనుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం ఏజెన్సీలోని ఆసుపత్రులను అ భివృద్ధి చేస్తోందన్నారు ఎంపీ గొడ్డేటి మాధవి. ఇకపై అరకు ఏరియాలో ఆక్సిజన్ కొరత వల్ల మరణాలు సంభవించివని, ప్రజలందరూ వచ్చే పండుగ రోజుల్లో కరోనా నియమ నిబంధనలు పాటించాలని ఎంపీ సూచించారు.

మరోవైపు విశాఖలోని ఛాతి ఆసుపత్రిలో పీఎం కేర్స్‌ ద్వారా ఏర్పాటు చేసిన ఆక్సీజన్‌ ప్లాంట్‌ను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 1000 LPM సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను నిర్మించామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు వైద్యం కోసం విశాఖపై ఆధారపడి ఉన్నాయని, ఈ అవసరాలను గుర్తించే విశాఖలో ఆసుపత్రులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు మంత్రి. కరోనా సెకండ్‌ వేవ్‌లో మరణాలు ఎక్కువగా సంభవించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి.

Also Read..

Allu Arjun: శంకర్‌పల్లిలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సందడి.. తహశీల్దార్‌ ఆఫీసుకు క్యూ కట్టిన అభిమానులు

ATM theft case: అప్పులు తీర్చలేక ఏటీఎం కొల్లగొట్టాలనుకున్నాడు.. కట్‌చేస్తే కథ అడ్డం తిరిగింది.. చివరకు..