UGC NET June 2026: విద్యార్ధులకు మరో ఛాన్స్.. యూజీసీ నెట్ 2026 దరఖాస్తు గడువు పొడిగింపు! ఎప్పటివరకంటే..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నెట్ 2026 జూన్ సెషన్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు ఎన్టీయే మరో అవకాశం ఇచ్చింది. ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ ప్రటకన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు ప్రక్రియ మే 20తో ముగిసింది. ఈ క్రమంలో..

హైదరాబాద్, మే 21: యూజీసీ నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) 2026 జూన్ సెషన్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రటకన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు దరఖాస్తు ప్రక్రియ మే 20తో ముగిసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును 2026 మే 23వ తేదీ వరకు అధికారులు పొడిగించారు. ఇప్పటి వరకు నెట్‌కు ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు మే 23, 2026వ తేదీలోపు తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు స్పష్టం చేశారు.
యూజీసీ నెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా ఈ ఏడాది యూజీసీ నెట్ పరీక్షలను 2026 జూన్ 22వ తేదీ నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ఉపయోగపడే ఈ పరీక్షను యేటా ఎన్టీయే రెండు సార్లు నిర్వహిస్తుంది. మొత్తం 85 సబ్జెక్టులకు ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తుంది. 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉన్నా సరిపోతుంది.
దరఖాస్తు సమయంలో జనరల్, అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్ధులు రూ.1150, జనరల్- ఈడబ్ల్యూఎస్, ఓబీసీ- ఎన్‌సీఎల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్ధులు రూ.325 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. మే 25 నుంచి 27 వరకు దరఖాస్తు సవరణకు అవకాశం ఉంటుంది.
స్నానం చేయలేదని తల్లి మందలించిందనీ.. బావిలోకి దూకిన బాలిక! ఆ తర్వాత ఏం జరిగిందంటే
