పుట్టగొడుగులు పోషకాల పవర్‌హౌస్‌.. వీటితో బోలెడు బెనిఫిట్స్..

20 May 2026

Jyothi Gadda

పుట్టగొడుగులకు ఇప్పుడు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. వీటి రుచి చికెన్, మటన్ వంటకాలను తలపించడమే కాకుండా, శరీరానికి మేలు చేసే పోషకాల గని అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 బి-విటమిన్లు, పొటాషియం, సెలీనియం, రాగి, ఫైబర్, విటమిన్ సి, మరియు విటమిన్ డి వంటి అత్యవసర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి మష్రూమ్స్ ఒక సంజీవని లాంటివి.

పుట్టగొడుగుల్లో ఎర్గోథియోనిన్, సెలీనియం అనే రెండు ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, డీఎన్ఏను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను అరికడతాయి.

దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ముప్పులు తగ్గుతాయి. వీటిలో సోడియం తక్కువగా, పొటాషియం మరియు విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు (బీపీ) కంట్రోల్‌లో ఉంటుంది.

మష్రూమ్స్‌లో 80 నుండి 90 శాతం వరకు నీటి శాతమే ఉంటుంది. కేలరీలు, కొవ్వులు చాలా తక్కువ కాబట్టి వీటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే కడుపు నిండిన భావన కలిగి, త్వరగా ఆకలి వేయదు.

ఇది బరువు తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, శాకాహారంలో విటమిన్ డి లభించే అతికొద్ది ఆహారాల్లో పుట్టగొడుగులు ఒకటి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడానికి తోడ్పడతాయి.

కొన్ని రకాల అడవి పుట్టగొడుగులు అత్యంత విషపూరితమైనవి. వాటిలో భారీ లోహాలు, ప్రాణాంతక కెమికల్స్ ఉంటాయి. కాబట్టి, మార్కెట్లో ధృవీకరించబడిన వాటిని మాత్రమే వండే ముందు వేడి నీటితో బాగా క్లీన్ చేసి వండుకోవాలి.