మన్యం బంద్ అందుకేనా..!? భారీ వర్షంలోనూ నిరసనలు, మూతపడ్డ సంతలు.. అరకులోయలోనూ ఎఫెక్ట్..
Alluri Sitharama Raju district: అటు అరకు లోయ లోను బంద్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఏజెన్సీకి పర్యాటకులు ఎవరు ఈరోజు రావద్దని గిరిజన సంఘాల్లో విజ్ఞప్తి చేశాయి. ఆర్టీసీ బస్సులు తిప్పవద్దని డిపో మేనేజర్లకు కూడా వినతిపత్రాలు ఇచ్చాయి గిరిజన సంఘాలు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి. బొర్ర గుహలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం లాంటి సందర్శన స్థలాలు తెరుచుకోలేదు. బందు పిలుపు నేపద్యంలో ప్రత్యేక భత్రత ఏర్పాట్లు..

అల్లూరి జిల్లా, ఆగస్టు 3: ఆదివాసీలు రోడ్డెక్కారు.. గళం విప్పారు. హక్కుల కోసం ఏజెన్సీ బందుకు పిలుపునిచ్చారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. జోరున కురుస్తున్న వర్షంలోనూ ఆందోళనలో కొనసాగుతున్నాయి. అల్లూరి జిల్లాలో గిరిజన సంఘాల బంద్ కొనసాగుతుంది. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట గిరిజన సంఘాల ఆందోళన చేపట్టాయి. దీంతో డిపో కే పరిమితమయ్యాయి బస్సులు. దుకాణాలు మూతపడ్డాయి. బందు నేపథ్యంలో పోలీసులు మోహరించారు. మణిపూర్ ఆదివాసీలపై హింసకాండ ఆపాలని, నూతన అటవీ సంరక్షణ చట్టం రద్దు చేయాలని, జీవో నెంబర్ 3 కి చట్టబద్ధత కల్పించాలని, బోయ వాల్మీకులను ఎస్టిలో చేర్చొద్దంటూ డిమాండ్ చేస్తూ బంద్ నిర్వహిస్తున్నారు. వర్షంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అటు అరకు లోయ లోను బంద్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఏజెన్సీకి పర్యాటకులు ఎవరు ఈరోజు రావద్దని గిరిజన సంఘాల్లో విజ్ఞప్తి చేశాయి. ఆర్టీసీ బస్సులు తిప్పవద్దని డిపో మేనేజర్లకు కూడా వినతిపత్రాలు ఇచ్చాయి గిరిజన సంఘాలు. ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలు కూడా మూతపడ్డాయి. బొర్ర గుహలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం లాంటి సందర్శన స్థలాలు తెరుచుకోలేదు. బందు పిలుపు నేపద్యంలో ప్రత్యేక భత్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు.
వర్షంలోనూ..
అల్లూరి ఏజెన్సీలో భారీ వర్షాన్ని సైతం లో కూడ కొనసాగుతుంది బంద్. నేడు ఏజెన్సీలో జరిగే వారపు సంతలు రద్దు చేశారు. ఒడిశా నుండి వస్తున్న వ్యాపారస్తులు వెనుదగురుతున్నారు. ముంచింగి పుట్టు వద్ద రోడ్డుకు అడ్డంగా గిరిజన సంఘం బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బంద్ కారణంగా జీకే విధి నిర్మాణస్యంగా మారింది. దుకాణాలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చింతపల్లి ల్లో హనుమాన్ జంక్షన్ వద్ద గిరిజన సంఘము నాయకులు ఆందోళన చేపట్టారు. బంద్ పిలుపు నేపథ్యంలో కొయ్యూరులో దుకాణాలు తెరుచుకోలేదు. నర్సీపట్నం డిపో నుంచి ఆర్టీసీ సర్వీసులు నిలిపివేశారు.




రోడ్డుపై కుర్చీలు వేసుకుని..
కొయ్యూరు మం మర్రిపాలెం చెక్ పోస్ట్ వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది. రోడ్డుపై కుర్చీలో వేసుకుని నిరసన తెలుపుతున్నరు గిరిజనులు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
నిఘా నీడలో..
గిరిజన సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు మావోయిస్టు వారోత్సవాల్లో ఈ రోజు నుంచి ముగిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు.