AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Longest Rain: 881 రోజులు నాన్ స్టాప్ రెయిన్స్.. ఇదో వరల్డ్ రికార్డ్.. పూర్తి వివరాలివే..

Longest Rain: ఉత్తరాది భారతాన్ని మేఘాలు గత కొన్ని రోజులుగా కప్పేశాయి. యమునా నదీ జలాలు ఉప్పొంగి కొన్ని రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించింది. అనేక చోట్ల నదులు, కాలువలు తమ పరిధిని దాటి జనావాసాల్లోకి చేరాయి. ఇలా వరుసగా వర్షం పడుతూనే ఉంది. అయితే ప్రపంచ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు వర్షం ఎన్ని రోజులు పడిందో మీకు తెలుసా..? కనీసం అంచనా వేయగలరా..? అదేదో 20 లేదా 30 రోజులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇంకా ప్రపంచ రికార్డుల్లో ఉన్న..

Longest Rain: 881 రోజులు నాన్ స్టాప్ రెయిన్స్.. ఇదో వరల్డ్ రికార్డ్.. పూర్తి వివరాలివే..
Longest Rain Record
శివలీల గోపి తుల్వా
|

Updated on: Aug 03, 2023 | 11:01 AM

Share

Longest Rain: దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు అడపాదడపా పడుతున్నా ఉత్తరాది భారతాన్ని మేఘాలు గత కొన్ని రోజులుగా కప్పేశాయి. యమునా నదీ జలాలు ఉప్పొంగి కొన్ని రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించింది. అనేక చోట్ల నదులు, కాలువలు తమ పరిధిని దాటి జనావాసాల్లోకి చేరాయి. ఇలా వరుసగా వర్షం పడుతూనే ఉంది. అయితే ప్రపంచ చరిత్రలో సుదీర్ఘకాలం పాటు వర్షం ఎన్ని రోజులు పడిందో మీకు తెలుసా..? కనీసం అంచనా వేయగలరా..? అదేదో 20 లేదా 30 రోజులు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇంకా ప్రపంచ రికార్డుల్లో ఉన్న వర్షం అత్యధిక వ్యవధి ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే ఎవరైనా..

అవును,  ఎందుకంటే ప్రపంచ చరిత్రలో వర్షం కురిసిన సుదీర్ఘ కాలం రికార్డు ఏకంగా 881 రోజులుగా ఉంది. అంటే దాదాపు 2.5 సంవత్సరాలు వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. 2, 3 రోజుల వర్షానికే మనం ఒక్కోసారి అల్లాడిపోతాం. అలాంటిది 881 రోజుల నిరంతర వర్షం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండిఉంటుందో ఓ సారి అంచనా వేయండి. ఇంతకీ ఈ సుదీర్ఘ కాలం పాటు కురిసిన వర్షం ఎక్కడ పడిందంటే.. 1913లో అమెరికాలోని హోనోము మాకి(ఓహు) అనే గ్రామంలో కురిసింది. ఈ వర్షాలు 1913లో ప్రారంభమై 1916లో ముగిశాయి.

కాగా, 881 రోజుల పాటు కురిసిన వర్షం కారణంగా గ్రామం మొత్తం ధ్వంసమైంది, సమీప గ్రామాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ 881 రోజుల కాలంలో వర్షం స్థాయి చాలాసార్లు మందగించినప్పటికీ, ఒక్కరోజు కూడా వర్షం పూర్తిగా ఆగిపోలేదు. 881 రోజుల పాటు కురిసిన ఈ వర్షం కారణంగా హోనోము మాకి గ్రామస్థుల పరిస్థితి, వారి జీవన విధానం దుర్భరంగా మారింది. అనేక మంది అంటు వ్యాధులతో బాధపడ్డారు.

ఇవి కూడా చదవండి

భారత్‌లోనూ ఓ రికార్డు!

భారతదేశానికి మూడు వైపులా సముద్రం ఉన్నందున.. ఏ సముద్రంలో అల్పపీడనం ఏర్పడినా తీర ప్రాంతాలకు తుఫాన్ ప్రమాదం ఉండడం సర్వసాధారణ విషయం. ఈ  క్రమంలో మన దేశంలోనూ సుదీర్ఘకాలం వర్షం పడిన రికార్డు 86 రోజులుగా ఉంది. ఈ వర్షం 1995లో చిరపుంజీలో పడింది.

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..