Starving US Girl: అయ్యో.. ఆకలికి తాళలేక భవనంపై నుంచి దూకిన చిన్నారి..!
అమెరికా లోని వెస్ట్ వర్జీనియా లో ఆహారం కోసం ఎనిమిదేళ్ల బాలిక మొదటి అంతస్తు నుంచి దూకింది. తల్లిదండ్రులు ఆమెకు కొన్ని రోజులుగా ఆహారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. పోలీసుల కథనం ప్రకారం.. ర్యాన్ కీత్ హర్డ్‌మన్, ఎలియో ఎమ్ దంపతులకు నలుగురు పిల్లలు. తమ ఎనిమిదేళ్ల కుమార్తెకు చాలా రోజులుగా ఆహారం పెట్టలేదు. బాలికను బయటకు రాకుండా ఇంట్లోనే నిర్బంధించారు.
అమెరికా లోని వెస్ట్ వర్జీనియా లో ఆహారం కోసం ఎనిమిదేళ్ల బాలిక మొదటి అంతస్తు నుంచి దూకింది. తల్లిదండ్రులు ఆమెకు కొన్ని రోజులుగా ఆహారం ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. పోలీసుల కథనం ప్రకారం.. ర్యాన్ కీత్ హర్డ్‌మన్, ఎలియో ఎమ్ దంపతులకు నలుగురు పిల్లలు. తమ ఎనిమిదేళ్ల కుమార్తెకు చాలా రోజులుగా ఆహారం పెట్టలేదు. బాలికను బయటకు రాకుండా ఇంట్లోనే నిర్బంధించారు. ఆకలికి తట్టుకోలేని చిన్నారి టెడ్డీబేర్ సాయంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. దగ్గర్లో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగింది. అందులో ఉన్న ఒక ఉద్యోగి పాప పరిస్థితిని గమనించి ఆహార పదార్థాలు అందించాడు. అనుమానంతో ఆమెను ప్రశ్నించగా.. ఆమె తన తల్లిదండ్రుల గురించి వివరించింది. విషయం తెలుసుకున్న ఉద్యోగి అధికారులకు సమాచారం అందించాడు.
చాలా రోజులుగా ఆకలితో ఉన్నానని అమ్మ, నాన్న నన్ను సరిగా చూసుకోవడం లేదని బాలిక చెప్పింది. ఇంట్లో నుంచి బయటకు రానివ్వడం లేదని తనను శిక్షించేవారని అందుకే పై నుంచి దూకినట్లు చెప్పుకొచ్చింది. మూడు రోజుల క్రితం ఒక బర్గర్ మాత్రమే తిన్నా అని బాలిక తెలిపింది. వారి ఇంటిని అధికారులు సోదా చేశారు. ఇంట్లో ఆహారం ఉన్నా పెట్టడం లేదని తేలింది. వారి నుంచి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకుని పోలీసులు దంపతులను కస్టడీలోకి తీసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...