Singapore: 20 ఏళ్ల తర్వాత అక్కడ తొలిసారి మహిళకు ఉరిశిక్ష.. ఏ కేసులో అంటే..?

Singapore: 20 ఏళ్ల తర్వాత అక్కడ తొలిసారి మహిళకు ఉరిశిక్ష.. ఏ కేసులో అంటే..?

Anil kumar poka

|

Updated on: Aug 03, 2023 | 8:23 AM

మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్‌ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న ఉరిశిక్ష అమలు చేయనుంది ప్రభుత్వం.

మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించిన కేసులో ఇద్దరు దోషులను సింగపూర్‌ ప్రభుత్వం ఈ వారం ఉరితీయనుంది. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. కాగా గత 20 ఏళ్లలో సింగపూర్‌లో మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి. అయితే ఈ ఉరిశిక్షల అమలును నిలిపివేయాలని అక్కడి హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి జులై 28న ఉరిశిక్ష అమలు చేయనుంది ప్రభుత్వం. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా తరలించిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు.

ఈ ఉరిశిక్ష అమలైతే దాదాపు 20 ఏళ్లలో సింగపూర్‌లో ఓ మహిళను ఉరితీయడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారి 2004లో డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళా హెయిర్‌ స్టైలిష్‌ యెన్‌ మే వుయెన్‌కు ఉరిశిక్ష పడింది. సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సింగపూర్‌లో ప్రపంచంలోనే అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసే వారికి మరణశిక్ష విధిస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును సింగపూర్‌ నిలిపి వేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...