AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు

ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు(ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.

నేటితో ముగియ‌నున్న ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 31, 2020 | 9:10 AM

Share

Layout regularisation scheme: ఫ్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం చేపట్టిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే ప‌ట్ట‌ణ‌, గ్రామీణ ప్రాంతాల్లోని అక్ర‌మ‌, అన‌ధికార లేఅవుట్లు, పాట్ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఆగ‌స్టు 31న రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీనికి రాష్ట్ర‌వాప్తంగా భారీ స్పంద‌న వ‌చ్చింది. (ఆస్ట్రేలియా పర్యటన: భారత క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌)

శుక్రవారం ఒక్క రోజే 70వేలకు పైగా అప్లికేషన్‌లు రాగా.. మొత్తం దరఖాస్తుల సంఖ్య 24,14,337 ల‌క్ష‌లకు చేరింది. మామూలుగా ఈ నెల 15వ తేదీనే ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగించాలనుకున్నప్పటికీ.. రాష్ట్రంలో వ‌ర్షాలు, ప‌లు కార‌ణాల దృష్ట్యా మ‌రో 15 రోజుల‌పాటు ప్రభుత్వం గడువును పెంచింది. ఇక ఎల్‌ఆర్‌ఎస్‌కి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు గ్రామపంచాయ‌తీల్లో 10,17,293, మున్సిపాలిటీల్లో 10,02,325, కార్పొరేష‌న్ల‌లో 3,94,719 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఈరోజు ల‌క్ష వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నావేస్తున్నారు. కాగా, సాదాబైనామాల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌కు మ‌రో వారం రోజుల గడువు ఉంది. ( నవంబర్ 2 నుంచి ఏపీలో డిగ్రీ, పీజీ తరగతులు.. మార్గదర్శకాలివే)

Follow Us