Korukonda: నేడు సైనిక్ స్కూల్ లో ఘనంగా జరగనున్న స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు. ఎందుకంటే..!
విజయనగరం జిల్లా ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ లో ఇవాళ స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి
Swarnim Vijay Varsh: విజయనగరం జిల్లా ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్ లో ఇవాళ స్వర్నిమ్ విజయ్ వర్ష్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 1971 లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇవాళ విక్టరీ టార్చ్ కోరుకొండ సైనిక్ స్కూల్ కి తరలిరానున్న నేపథ్యంలో ఈ వేడుకలు ఇవాళ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, జిల్లా అధికారులు పాల్గోనున్నారు.
కాగా, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ ఓడించి 2021 డిసెంబర్ 3కు యాబై ఏళ్లు నిండాయి. అందువల్ల ఈ ఏడాదంతా స్వర్ణం విజయ్ వర్ష్ ఉత్సవాల్ని నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆనాటి విజయానికి గుర్తుగా ఉన్న స్వర్ణిమ్ విజయ్ వర్ష్ జ్యోతి ఇప్పటికే విశాఖపట్నం తూర్పు నౌకాదళానికి చేరిన సంగతి తెలిసిందే. భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది.
బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి భారత్ అప్పట్లో పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’గా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం డిసెంబరు 16న దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ‘ఎటర్నల్ ఫ్లేమ్’ నుంచి నాలుగు విజయ జ్యోతులు వెలిగించారు. ఆ జ్యోతులను దేశంలోని నాలుగు దిక్కులకు పంపారు. దక్షిణ భారతదేశం వచ్చిన విజయ జ్యోతి వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇప్పుడు విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక్ స్కూల్ కు చేరుకుంది.
Read also: Kurnool: పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. రైతుల కంటతడి