AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విశాఖపట్నం-అరకు మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains: ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే వ్యవస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు..

Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విశాఖపట్నం-అరకు మధ్య ప్రత్యేక రైళ్లు
Subhash Goud
|

Updated on: Dec 27, 2021 | 7:01 PM

Share

Special Trains: ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే వ్యవస్థ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇక పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. డిసెంబర్‌ 30 నుంచి 2022 జనవరి 16 వరకు విశాఖపట్నం-అరకు మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది.

రైలు నెంబర్‌ 08525 విశాఖపట్నం-అరకు ప్రత్యేక రైలు డిసెంబర్‌ 30 నుండి 2022 జనవరి16 వరకు ప్రతిరోజూ 07.00 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరి అరకుకు 11.30 గంటలకు చేరుకుంటుంది.

అలాగే రైలు నంబర్‌ 08526 డిసెంబర్‌ 30 నుంచి నుండి వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఈ ప్రత్యేక రైలు ప్రతిరోజూ 14.00 గంటలకు అరకు నుంచి బయలుదేరి విశాఖపట్నంకు17.30 గంటలకు చేరుకుంటుంది. ఈ జంట రైళ్లలో ఎనిమిది సెకండ్ క్లాస్ కోచ్‌లు మరియు రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజీ కోచ్‌లు ఉంటాయి.

ఈ రైళ్లకు విశాఖపట్నం-అరకు స్టేషన్ల మధ్య సింహాచలం, కొత్తవలస, శృంగవరపుకోట, బొర్రాగుహలు వద్ద స్టాప్‌లు ఉంటాయి. ప్రజలు ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. అయితే రైలు ప్రయాణం చేపట్టేటప్పుడు కోవిడ్-19 నిబంధనలు పాటించాలని సూచించారు. ఏదైనా రైలు సంబంధిత హెల్ప్ లైన్ కోసం139కి కాల్ చేయవచ్చని సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Bank Holidays January 2022: జనవరిలో బ్యాంకులకు సెలవులు.. ఎన్ని రోజులు అంటే..!

Chicken Biryani: ఈ ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీ.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..!