Chicken Biryani: ఈ ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీ.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..!

Biryani Order: చాలా మంది ఆన్‌లైన్‌లో రకరకాలుగా ఆర్డర్లు చేస్తుంటారు. ఫుడ్‌ నుంచి వివిధ వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ చేస్తుంటారు. ఇక దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో..

Chicken Biryani: ఈ ఏడాది దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీ.. తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 27, 2021 | 4:59 PM

Chicken Biryani: చాలా మంది ఆన్‌లైన్‌లో రకరకాలుగా ఆర్డర్లు చేస్తుంటారు. ఫుడ్‌ నుంచి వివిధ వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్స్‌ చేస్తుంటారు. ఇక దేశంలో ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ చికెన్‌ బిర్యానీగా నిలిచింది. వరుసగా ఆన్‌లైన్‌ ఆర్డర్లలో టాప్‌ ఆర్డర్‌ ఇదేగా తేలింది. 2021లో అత్యధికంగా ఆన్ లైన్‌లో ఆర్డర్‌ చేసుకున్నది చికెన్ బిర్యానీనే. స్నాక్స్ కేటగిరి విషయానికొస్తే అత్యధికంగా ఆర్డర్‌ చేసుకున్నది సమోసాలు. అలాగే స్వీట్‌ డిష్ కేటగిరీల్లో అత్యధికంగా తిన్నది గులాబ్ జామూన్, రస్ మలయ్ మిఠాయిలు. 2021 సంవత్సరానికి ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్లపై ఓ ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. మిగతా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల ఆర్డర్లు, నేరుగా ఫుడ్‌ స్టాల్స్‌, హోటళ్లకు వెళ్లి తింటున్నవారిలో సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. సర్వే ప్రకారం..

కోవిడ్‌ను సైతం లెక్క చేయని బిర్యానీ ప్రియులు 2021లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ను సైతం లెక్క చేయని బిర్యానీ, సమోసా ప్రియులు అధిక సంఖ్యలో ఆర్డర్లు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. ఈ ఏడాదిలో 6 కోట్ల 4 లక్షల 44వేల బిర్యానీ ఆర్డర్లు ఒక కంపెనీకి వచ్చాయని స్వీగ్గి వెల్లడించింది. ఈ లెక్క ప్రకారం.. ప్రతీ ఒక నిమిషానికి 115 లేదా ఒక సెకనుకు 2 ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ల నమోదైనాయని వెల్లడైంది. ఇక 2020లో బిర్యానీ ఆన్‌లైన్‌ ఆర్డర్లు నిమిషానికి 90 ఉండగా, వెజ్ బిర్యానీతో పోలిస్తే చికెన్ బిర్యానీ ఆర్డర్లు 5 రెట్లు ఎక్కువ. చికెన్ బిర్యానీ ఎక్కువగా ఆర్డర్లు నమోదవుతున్న నగరాల్లో టాప్‌లో కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, లక్నో నగరాలు ఉన్నాయి. ఈ ఏడాది ఈ సంస్థ యాప్‌లో కొత్తగా లాగిన్ చేసిన వారిలో 4.25 లక్షల యూజర్లు తమ తొలి ఆర్డర్ బిర్యానీ అని వెల్లడించారు.

స్నాక్స్‌ కేటగిరిల్లో సమోసాలు.. ఇక స్నాక్స్ కేటగిరిలో 2021లో ఈ యాప్‌ ద్వారా 50 లక్షల సమోసాలు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు. ఆన్ లైన్లో ఆర్డర్ చేశారు. ఇంకా చెప్పాలంటే.. ఈ యాప్‌ ద్వారా ఆర్డర్ చేసిన సమోసాల సంఖ్య న్యూజిలాండ్ జనాభాతో సమానమట. దేశంలో సమోసా అంటే ఇష్టపడని వారు ఉండరు. సమోసాపై బాలీవుడ్ సాంగ్‌లు సైతం హిట్‌గా మారాయి. దేశంలో ఏటా సమోసా మార్కెట్ విలువ రూ.27.5 కోట్లు. ప్రతీ రోజు దేశంలో 6 కోట్లు సమోసాలు తింటున్నారట. భారతీయులు సమోసాలంటే ఎగబడి తింటున్నారని సర్వేలో తేలింది.

ఉత్తర భారతదేశంలో అతిథులకు తొలుత టీ, సమోసాలిచ్చే స్వాగితించే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది భారతీయులు పావ్ బాజీలను సైతం ఎక్కువగా తింటున్నట్లు తేలింది. సాధారణంగా పావ్ బాజీ ఉత్తరాధి రాష్ట్రాల్లో ఎక్కువగా తింటుంటారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఈ స్నాక్ కు భారీ డిమాండ్‌ పెరిగింది. 2021లో 21 లక్షల పావ్ బాజీ స్నాక్స్ లను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు.

స్వీట్లలో గులాబ్ జామూన్ టాప్: ఇక స్వీట్స్‌ విషయానికొస్తే.. ఈ ఏడాది గులాబ్‌ జామ్‌ టాప్‌లో ఉంది. ఈ ఏడాది నమోదైన గులాబ్ జామూన్ ఆన్‌లైన్‌ ఆర్డర్లు 21 లక్షలు. ఇక రసమలాయ్ ఆర్డర్ల సంఖ్య 12.70 లక్షలు. వీటితో పాటు నూడుల్స్, చాకోలెట్స్, ఐస్ క్రీమ్స్, చిప్స్ వంటి స్కాక్స్‌ను లక్షల సంఖ్యలో ఆర్డర్లు చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి:

Hair Loss: జుట్టు ఎందుకు రాలుతుంది.? బట్టతల ఎందుకు వస్తుంది.. జుట్టు బలంగా ఉండేందుకు చిట్కాలు..!

Cholesterol Food: మీ శరీరంలో కలెస్ట్రాల్‌ పెరిగిపోతోందా..? ప్రమాదమే..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!