Booster Dose: బూస్టర్ డోస్‌పై కీలక ఆదేశాలు.. నిపుణుల బృందం ఏమన్నారంటే.!

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడమే కాకుండా....

Booster Dose: బూస్టర్ డోస్‌పై కీలక ఆదేశాలు.. నిపుణుల బృందం ఏమన్నారంటే.!
Covid Vaccine
Follow us

|

Updated on: Dec 27, 2021 | 4:31 PM

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడమే కాకుండా.. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లతో పాటు కోమార్బిడిటీస్ ఉన్న వయోవృద్ధులకు మూడో డోస్(బూస్టర్ డోస్) వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మూడో డోస్ కోవిడ్ టీకాపై సమావేశమైన నిపుణుల బృందం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మొదటి రెండు డోసులు ఏ రకం టీకా తీసుకున్నారో.. మూడో డోస్ కూడా అదే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. కోవిడ్ రెండో డోస్ తీసుకున్న 9-12 నెలల మధ్యకాలంలో 3వ బూస్టర్ డోస్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లతో పాటు కోమార్బిడిటీస్ ఉన్న వయోవృద్ధులకు 3వ డోస్‌ను జనవరి 10వ తేదీ నుంచి ఇచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. కాగా, ఇప్పటికే ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి విదితమే.