- Telugu News India News Pm narendra modi in himachal pradesh inaugurated projects worth 11000 crores photos
PM Modi: హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.. రూ.11వేల కోట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులకు శ్రీకారం.. దృశ్యాలు
హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
Updated on: Dec 27, 2021 | 3:05 PM

హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. 28,197 కోట్ల విలువైన 287 పెట్టుబడి ప్రాజెక్టులను ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ధౌలసిద్ధా హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌తో పాటు రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. అనంతరం మండిలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, జలవిద్యుత్ ప్రాజెక్టులు వాతావరణ అనుకూల నవ భారతదేశంలో భాగమని, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణకు దేశం చేస్తున్న కృషికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని మోడీ అన్నారు.

హిమాచల్ ప్రదేశ్‌కు పూర్తి రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవ సంవత్సరం వేడుకలు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని పహారీ భాషలో ప్రారంభించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నా జీవితానికి దిశానిర్దేశం చేయడంలో హిమాచల్ భూమి ముఖ్యమైన పాత్ర పోషించిందని ప్రధాని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్ ద్వారా కంగనిధర్ హెలిప్యాడ్‌లో దిగారు. ప్రధాని మోడీ రాగానే చిన్న కాశీ సంగీత వాయిద్యాలతో ప్రతిధ్వనించింది. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ స్వాగతం పలికారు.

ఇన్వెస్టర్స్ మీట్ రెండో గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

ప్రకృతి ఖేతి ఖుషాల్ కిసాన్ యోజన ఎగ్జిబిషన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ చాలా సేపు పరిశీలించారు. ఈ సందర్భంగా, పథకం డైరెక్టర్, రాకేష్ కన్వర్, హిమాచల్ ప్రదేశ్‌లోని సహజ వ్యవసాయ ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందించారు.

అదే సమయంలో 210 మెగావాట్ల ప్రాజెక్టును రూ.1800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించనున్న లుహ్రీ మొదటి దశ జలవిద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

మండిలోని ధౌలా సిద్ధ జలవిద్యుత్ , రేణుకాజీ డ్యామ్ ప్రాజెక్టులతో సహా రూ.11,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.

మండిలో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ, జలవిద్యుత్ ప్రాజెక్టులు వాతావరణ అనుకూల నవ భారతదేశంలో భాగమని, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఉన్నాయని అన్నారు.




