AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: భోగాపురం-భీమిలి మధ్య శాటిలైట్ టౌన్షిప్..? దిగ్గజ సంస్థల ఎంట్రీతో మారిపోనున్న వైజాగ్ రూపురేఖలు..

Visakhapatnam News: పర్యాటక నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం.. ఇప్పుడు ఆ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు విశాఖ వైపు చూస్తున్నాయి.

Visakhapatnam: భోగాపురం-భీమిలి మధ్య శాటిలైట్ టౌన్షిప్..? దిగ్గజ సంస్థల ఎంట్రీతో మారిపోనున్న వైజాగ్ రూపురేఖలు..
YS Jagan
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 09, 2023 | 6:22 PM

Share

Visakhapatnam News: పర్యాటక నగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం.. ఇప్పుడు ఆ దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు విశాఖ వైపు చూస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ భీమిలి, దానికి అనుకొని ఉన్న విజయనగరం సరిహద్దు ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే కేవలం 65 రోజుల్లోనే మూడు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. తాజాగా, ఒబెరాయ్ గ్రూప్ కు చెందిన సెవెన్ స్టార్ విల్లాస్ లగ్జరీ రిసార్ట్స్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

ఒబేరాయ్ సెవెన్ స్టార్ లగ్జరీ రిసార్ట్స్.. 40 ఎకరాల్లో 350 కోట్ల వ్యయంతో..

అంతర్జాతీయ స్థాయిలో హోటల్ రంగంలో దిగ్గజంగా భావించే ఒబెరాయ్ గ్రూప్ సంస్థ.. సెవెన్ స్టార్స్ రిసార్ట్, విల్లాస్ కు విశాఖ సాగర తీరంలో నెలకొల్పు ముందుకు వచ్చింది. విశాఖలోని ఈ ఏడాది మార్చిలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో జరిగిన ఒప్పందంలో భాగంగా ఒబెరాయ్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవొయు కుదుర్చుకుంది. విశాఖలో తమ సంస్థ కార్యకలాపా విస్తరించాలని ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భీమిలి మండలం అన్నవరం సముద్రం తీరం సమీపంలో 40 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించింది. ఆదివారం నాడు కడప జిల్లా గండికోట నుంచి గండికోటలో ఒబెరాయ్ గ్రూప్స్ హోటల్స్ కు భూమి పూజ చేశారు. తిరుపతి, భీమిలి లో ఒబెరాయ్ గ్రూప్స్ కు చెందిన 7స్టార్ రిసార్ట్స్ విల్లాస్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. కోనసీమ లాంటి కొబ్బరి చెట్లు, సువిశాల సాగర తీరం, ప్రకృతి సహజ సిద్ధ ప్రకృతి అందాల మధ్య ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది.

Vizag

Vizag

అన్నవరంలో 309 లగ్జరీ విల్లాలు..

విశాఖ – విజయనగరం సరిహద్దు భీమిలి అన్నవరం సర్వేనెంబర్ 108 లో ఒబెరాయ్ గ్రూప్స్ కి ప్రభుత్వం భూమిని లీజు పద్ధతిలో కేటాయించింది. వచ్చే నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తిగా పోతుంది. 40 ఎకరాల్లో 350 కోట్ల వ్యయంతో 300 లగ్జరీ విల్లాలు రూపు దిద్దుకోనున్నాయి. దీంతోపాటు ప్రపంచ స్థాయి అత్యాధునిక హంగులతో ఓపెన్ లాంజ్, రెస్టారెంట్స్, కాఫీ షాప్, కాన్ఫరెన్స్ హాల్, స్విమ్మింగ్ పూల్, పార్టీ ఏరియా నిర్మిస్తుంది. ఉబెరాయ్ హోటల్లో ప్రాజెక్టు పూర్తయితే విశాఖకు మరింత పర్యాటకంగాను అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కలెక్టర్ మల్లికార్జున. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు వేల మందికి పైగా ఉపాధి లభించబోతోంది. వచ్చే పదిహేనేళ్లలో భోగాపురం భీమిలి మధ్య ప్రత్యేక సిటీ రూపుదిద్దుకుంటుందని అన్నారు కలెక్టర్.

ఇవి కూడా చదవండి

బీచ్ కారిడార్ కు 150 మీటర్లు..!

ఈ ప్రాజెక్టు మరో విశేషం ఏంటంటే.. భోగాపురం ఎయిర్పోర్ట్ కు కేవలం 8 కిలోమీటర్లు దూరంలోనే రూపుదిద్దుకుంటుంది. దీనికి తోడు.. విశాఖ బీచ్ కారిడార్ కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఉంది. ఒకవైపు కోస్టల్ రీసన్ కావడం మరోవైపు బీచ్ కారిడార్ నేపథ్యంలో అటు భీమిలి భోగాపురం మధ్య రిబ్బన్ గ్రోత్ ఏర్పడనుంది. పర్యాటకంగాను ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది ఈ ప్రాంతం రూపురేఖలని మారబోతున్నాయి.

Vizag1

Vizag

65 రోజుల్లో మూడు కీలక ప్రాజెక్టులు..! ఉద్యోగాలే ఉద్యోగాలు..

మార్చ్ లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ తర్వాత విశాఖలోని భీమిలి నియోజకవర్గం తో పాటు దానికి ఆనుకుని ఉన్న విజయనగరం జిల్లా భోగాపురం లో కీలక ప్రాజెక్టులకు శిఖరం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అదాని డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్ లకు శంకుస్థాపన చేసిన సీఎం.. ఇప్పుడు ఒబెరాయ్ గ్రూప్స్ లగ్జరీ రిసార్ట్స్ విల్లాస్ కు శంకుస్థాపన చేశారు. దాదాపు 21 వేల కోట్లతో నిర్మించబోయే అదాని డేటా సెంటర్ బిజినెస్ టెక్ కు ఇప్పటికే ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఏదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. దీంతో 20 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు కలెక్టర్ మల్లికార్జున. దీంతోపాటు నాలుగున్నర వేల కోట్లతో రూపుదిద్దుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ తో మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఇప్పుడు 350 కోట్లతో 40 ఎకరాల్లో నిర్వహించబోయే లగ్జరీ రిసార్ట్స్, విల్లాస్తో 5000 మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో భీమిలి భోగాపురం మధ్య సరికొత్త టౌన్షిప్ ఏర్పాటు కాబోతోంది. కేవలం భీమిలి నియోజకవర్గం కాకుండా.. కీలక మూడు ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చెందుతుందని అంటున్నారు ఎమ్మెల్యే అవంతి.

కీలక ప్రాజెక్టులతో వాటికి అనుసంధానంగా ఉన్న అన్ని రంగాల్లోనూ విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది. టూరిజం పరంగా మరింతగా ప్రపంచ దృష్టిని విశాఖ మరింత ఆకర్షించబోతుంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన తర్వాత విశాఖ నగరంతోపాటు.. విశాఖ విజయనగరం సరిహద్దు ప్రాంతంలో కీలక ప్రాజెక్టులు రావడం.. ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందబోతుంది..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..