Visakhapatnam News : ముంచుకొస్తున్న ప్రమాదం.. వైజాగ్, ముంబైలలో ముందుకొస్తున్న సముద్రం..
Visakhapatnam News : ఇండియాలోని పలు నగరాల్లో సముద్రం ముందుకు వస్తోందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) తెలియజేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసాకు చెందిన అంతర్
Visakhapatnam News : ఇండియాలోని పలు నగరాల్లో సముద్రం ముందుకు వస్తోందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (IPCC) తెలియజేసింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ నుంచి వచ్చిన విశ్లేషణ ప్రకారం.. సముద్ర మట్టాలలో మార్పులను అంచనా వేయడానికి IPCC నివేదిక సహాయపడుతుంది. అంతరిక్ష ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంతో పాటు ముంబై, చెన్నై, కొచ్చి, కాండ్లా, ఓఖా, భావ్ నగర్, మంగళూర్, మార్మగోవా, పారాదీప్, ఖిధిర్ పూర్, ట్యుటికోరిన్ 12 భారతీయ నగరాలు మునిగిపోయే ప్రమాదం ఉన్నట్లు గుర్తించింది, వాతావరణ మార్పు పరిస్థితులను అదుపు చేయకపోతే, సముద్ర మట్టాలు పెరగి తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. కనీసం ముడు నగరాలు నీటి అడుగుకి వెళ్లవచ్చని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరం దగ్గర ఆందోళనకర పరిస్థితి కనబడుతోంది.. అంతర్వేది బీచ్‌లో సముద్రం వున్నట్టుండి ముందుకు చొచ్చుకు వచ్చింది.. దాదాపు తీరమంతా మునిగిపోయి నీరే కనిపిస్తోంది.. అలలు కూడా ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.. ఒకటి కాదు రెండు కాదు.. 25 మీటర్ల మేర సముద్రం ముందుకు రావడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు సముద్రం ముందుకు చొచ్చుకు రావడం, భీకర అలలతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 20 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందని చెబుతున్నారు..
ప్రపంచవ్యాప్తంగా 71 శాతంగా ఉన్న జల వనరులు, 29 శాతం భూమి ఉండగా.. ఇప్పుడు సముద్రాల మట్టం మరింత పెరగడం కలవరపెడుతోంది. వాతావరణ మార్పులతో భూ-వాతావరణం వేడెక్కి హిమనీ నదులు కరిగిపోవడం కారణమవుతోంది. IPCC 1988 నుంచి ప్రతి ఐదు లేదా ఏడు సంవత్సరాలకు భూ వాతావరణంపై ప్రపంచ స్థాయి అంచనాలను అందిస్తోంది. ఉష్ణోగ్రత మరియు మంచు కవర్, గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు, గ్రహం అంతటా సముద్ర మట్టాలలో మార్పులపై దృష్టి పెట్టి రిపోర్ట్ ఇస్తుంది.