Malladi Krishna Rao: ఏపీ పాలిటిక్స్ వైపు మల్లాడి కృష్ణారావు అడుగులు..! విశాఖలో బీసీ సంఘాలతో కీలక సమావేశం వెనుక..

ఆయన సరిహద్దు రాష్ట్రమైన పాండిచ్చేరి కి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. ఐదు సార్లు ఎమ్మేల్యే గా మూడు పర్యాయాలు ఆ రాష్ట్ర కేబినెట్ లో కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉంటూ కూడా ఏపీ రాజకీయాలపై నిరంతరం ఆసక్తి ప్రదర్శించే ఆ మాజీ మంత్రి ఇప్పుడు తన రాజకీయ కార్యక్షేత్రాన్ని పాండిచ్చేరి నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు మార్చారా? తనకు సన్నిహితుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడి ప్రభుత్వానికి దన్నుగా నిలవాలని అనుకుంటున్నాడా? అందుకు కార్యాచరణ కూడా ప్రారంభించేశాడా? ఆయనెవరో ఇప్పటికే అందరికీ అర్దం అయ్యుంటుంది కదా! ఇంకా వివరంగా ఈ స్టోరీ చూడండి.

Malladi Krishna Rao: ఏపీ పాలిటిక్స్ వైపు మల్లాడి కృష్ణారావు అడుగులు..! విశాఖలో బీసీ సంఘాలతో కీలక సమావేశం వెనుక..
Malladi Krishna Rao (File Photo)
Follow us
Eswar Chennupalli

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 05, 2023 | 6:40 PM

విశాఖపట్నం: మల్లాడి కృష్ణారావు.. యానాం అసెంబ్లీ నియోజకవర్గం వేదికగా పాండిచ్చేరి రాష్ట్ర రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకమైన నేతగా ఉంటున్నారు.  మల్లాది కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ తో కూడా అదే తరహా రాజకీయ సంబంధాల్ని కలిగి ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంతం యానాం పేరుకు పుదుచ్చేరి రాష్టం అయినా మాట్లాడేదంతా తెలుగు భాషనే. యానాం వార్తలు మన తూర్పుగోదావరి జిల్లా పేపర్లలోనే వస్తాయి. యానాంకు ఆ రాష్ట్ర రాజధాని పాండిచ్చేరి 870 కి.మీ. దూరంలో తమిళనాడులో ఉంది. యానాం 1954 దాకా భారతదేశంలోని ఫ్రెంచ్ కాలనీగా ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో భాగం. 1954లో విమోచనం చెంది, స్వతంత్ర భారతావనిలో విలీనం చెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు. దాంతో అది పాండిచ్చేరి లో అలా ఉందిపోవాల్సి వచ్చింది. గతంలో కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని గ్రేటర్ కాకినాడలో కలపాలని తీర్మానం చేసింది. 870 కిలోమీటర్ల దూరంలోని రాజధాని తమిళ పుదుచ్చేరికి కంటే యానాం ప్రజల ప్రయాణం కాకినాడ కేంద్రం గానీ జరుగుతుంతుంది. అలాంటి యానాంలో ఉన్నది కేవలం 55 వేలు ఓట్లు అయినా గత 70 ఏళ్లలో దాదాపు 60 యేళ్లు ఇద్దరే ఎమ్మెల్యేలు గా ఉండే వారు. వారిలో మల్లాడి కృష్ణా రావు ఒకరు. 1996 నుంచి 2021 వరకు 25 సంవత్సరాలు ఏకచకాధిపత్యంగా ఐదు సార్లు వరుసగా ఎమ్మెల్యే గా, 2006 నుంచి పర్యాటక, స్థానిక పరిపాలన, పౌర విమానయానం, గ్రామీణాభివృద్ధి, జిల్లా, గ్రామీణాభివృద్ధి శాఖలను, 2008 లో రెండవసారి రెవెన్యూ, ఎక్సైజ్, ఫిషరీస్, పర్యాటకం, పౌర విమానయాన మంత్రిగా చేశారు. 2016-2021 కాలంలో పుదుచ్చేరి వైద్యశాఖ మంత్రిగా పనిచేసారు.

మల్లాడి రాజకీయ ప్రస్థానం..

రాజకీయాల్లోకి రాకముందు సామాజిక కార్యకర్తగా విశేషమైన నేపథ్యం మల్లాడికి ఉంది. యానాం సమస్యల పరిష్కారం కోసం అంటూ 1994 లో యానాం నుంచి పాండిచ్చేరి కి 870 కిలోమీటర్ల దూరాన్ని వందలాది మంది కార్యకర్తల తో ఐదు రోజుల్లో నడిచి వెళ్ళి సంచలనం సృష్టించిన నేతగా పేరుంది. అలాగే ఓల్డ్ ఏజ్ హోం, బ్లడ్, ఐ బ్యాంక్ ల ఏర్పాటు, పేదలకు తన సొంత స్థలం లో పలు కాలనీ లు నిర్మించిన నేతగా కూడా చెబుతుంటారు. అలాంటి నేత ఆ రాష్ట్ర హోం మంత్రిగా ఉంటూనే 2021 లో తాను యానాం నుంచి పోటీ చేయనంటూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రకటించి సంచలనం సృష్టించాడు. 2020 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున 56 బీ సీ కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అతిథిగా హాజరైన మల్లాడి.. అదే వేదికపై యానాం నుంచి ఇక పోటీ చేయనని ప్రకటించడం అప్పట్లో సంచలనం అయింది. ఈ విషయం ఇంకా మా పాండిచ్చేరి రాష్ట్ర సీఎం కు చెప్పలేదు మీ ముఖ్యమంత్రి సమక్షంలో చెప్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకే దారి తీశాయి. అనంతరం అక్కడ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని నిలబెట్టి మద్దతు ఇచ్చారు కానీ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డ గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ గెలవడం, ఆ తర్వాతా పాండిచ్చేరి రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి గా యానాం లో ఆయన రాజకీయ ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు.

వైఎస్సార్‌తో సాన్నిహిత్యం..

అదే సమయంలో యానాం లో మంత్రిగా ఉన్నా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తో సన్నిహితుడిగా ముద్రపడ్డ మల్లాడి కృష్ణా రావు ఆయన తర్వాతా జగన్ తోనూ సన్నిహిత, రాజకీయ సంబంధాలను సాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి జిల్లా ముమ్మిడివరం తో పాటు పలు మత్స్యకార ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో ఆయన అప్పట్లో వైఎస్ కు అనుకూలంగా, ప్రస్తుతం వైసీపీ కు అనుకూలంగా ప్రచారం కూడా చేస్తూ ఉంటారని ప్రచారం ఉంది. బిసీ – అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఆంధ్ర ప్రదేశ్ బీసీ ఐక్యతా సంస్థలకు గౌరవ అధ్యక్షులుగా ఉంటూ 2019 ఎన్నికలకు ముందు బీసీ సంఘాలను వైసీపీ కు అనుకూలంగా మలిచేందుకు కూడా ప్రయత్నించారని చెబుతుంటారు. అనంతరం ఆయనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యులు గా కూడా అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఆ పదవిలో కూడా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

బీసీ సంఘాలతో ప్రత్యేక సమావేశాలు..

అలాంటి కృష్ణా రావు ఇటీవల విశాఖ లోని ఒక ప్రైవేట్ హోటల్ లో బిసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. బీసీలు అందరూ ఐక్యంగా ఉండాలంటూ బిసీల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారట. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సమావేశాల ఏర్పాటుకు సిద్ధమయ్యారట. అలాగే రాష్ట్రంలో పలువురు బీసీ నాయకులను కలిసే పనిలో ఉన్నారట. ప్రభుత్వం పట్ల బీసీ ల వైఖరిని తెలుసుకోవడం, వాటిని సరిదిద్దేలా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారట. ఈ అసైన్మెంట్ ప్రభుత్వ పెద్దలు ఇచ్చారో లేదంటే వైఎస్ కుటుంబం తో ఉన్న సాన్నిహిత్యం వల్ల తానే చేస్తున్నాడో, లేక నిజంగా బీసీల ఐక్యతా రాగమా అన్నది అర్దం కావడం లేదన్నది ఒక వాదన. అయితే ఆయన పుదుచ్చేరి రాజకీయాలకంటే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల పై ఇటీవల మక్కువ చూపుతున్నారనీ, యానాం నుంచి ఇక పోటీ చేయనని ప్రకటించిన నేపథ్యంలో అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారా? అందుకే బీసీ సంఘాల ఐక్యత పేరుతో అన్ని ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించాలని మొదట విశాఖలో నిర్వహించారా? 2024 ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న బీసీ ఓట్ల ఐక్యత పై దృష్టి ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ పెద్దలే కృష్ణా రావును రంగంలోకి దించారన్న చర్చ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..