Andhra Pradesh: అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య.. ప్రియుడే స్నేహితుడిగా పరిచయమై.

Guntur News: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏకంగా భర్తనే హత్య చేసింది. పది నెలల పరిచయం కోసం పదేళ్ళ వివాహేతర సంబంధానికి గుడ్ బై చెప్పింది. అత్యంత పక్కాగా చేసిన మర్డర్ కేసులో సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

Andhra Pradesh: అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించిన భార్య.. ప్రియుడే స్నేహితుడిగా పరిచయమై.
Iamge
Follow us
T Nagaraju

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Jul 05, 2023 | 4:11 PM

Guntur News: గుంటూరు కృష్ణబాబు కాలనీలో ఉండే షాహీనాకు పదేళ్ళ క్రితం బాషాతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. షాహీనా పది నెలలు క్రితం ఒక అపార్ట్మెంట్‌లో పని మనిషిగా చేరింది. అదే అపార్ట్మెంట్‌లో షబ్బీర్ అనే యువకుడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం బాషాకు తెలియదు. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్న బాషాను తొలగించుకుంటే కలిసి జీవించవచ్చని షాహీనా, షబ్బీర్ అనుకున్నారు. అడ్డుగా ఉన్న బాషాను తొలగించుకోవాలనుకున్నారు. షబ్బీర్ తనకు బంధువైన రఫికి విషయం చెప్పాడు. రఫీ కొత్త సిమ్ కొనుగోలు చేసి బాషాకు ఫోన్ చేశాడు.

ఇంకా తనకి రెండు లారీలున్నాయని వాటికి పెయింట్ వేయడానికి రావాలని బాషాకి చెప్పాడు. ఆ విధంగా బాషాతో పరిచయం పెంచుకున్నాడు. కొద్దిగా డబ్బులు కూడా అడ్వాన్స్ గా ఇచ్చాడు. సాన్నిహిత్యం పెరగడంతో బాషాకు మద్యం సేవించడానికి రావాలని ఈ నెల ఒకటో తేదీన పిలిచారు. మద్యం తాగటానికి వచ్చిన ఒంటరిగా వచ్చిన బాషాను రఫీ, షబ్బీర్ కలిసి అత్యంత్య దారుణంగా కత్తులతో నరికి చంపారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాషా సెల్ ఫోన్‌పై దృష్టి సారించారు. ఒక ఫోన్ నెంబర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు ఆ సిమ్ కొనుగోలు చేసిన వారిపై దృష్టి పెట్టారు. సిమ్ కొనుగోలు చేసిన రఫిని పట్టుకున్నారు. దీంతో బాషా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

-టీ.నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..