AP Politics: గంటా శ్రీనివాసరావు వారసుడి పొలిటికల్ ఎంట్రీ.. లోకేష్ యువగళం పాదయాత్రలో కనిపించిన రవితేజ..

Vizag Politics: తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు గంటా రవితేజ రాబోతున్నారా? గంట రవితేజ కేవలం గంటా శ్రీనివాస్ కే కాకుండా టిడిపిలో మరొక కీలక నేత మాజీ మంత్రి అయిన నారాయణ సంస్థల అధినేత నారాయణకు కూడా రాజకీయ వారసుడే కాబోతున్నారా? నారాయణ ఏకైక కుమారుడు చనిపోవడం తో ఆయన కుమార్తెను వివాహం చేసుకున్న గంట రవితేజ నే నారాయణ రాజకీయ వారసుడా? నెల్లూరులో ఉన్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో గంట రవితేజ ప్రత్యక్షం కావడానికి కారణాలేంటి? లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటున్న రవితేజ 2024 ఎన్నికల టార్గెట్గా ముందుకు వెళ్తున్నారా? ఇంట్రస్టింగ్‌గా ఉంది కదూ..

AP Politics: గంటా శ్రీనివాసరావు వారసుడి పొలిటికల్ ఎంట్రీ.. లోకేష్ యువగళం పాదయాత్రలో కనిపించిన రవితేజ..
Ganta Ravi Teja
Follow us
Eswar Chennupalli

| Edited By: Sanjay Kasula

Updated on: Jul 05, 2023 | 1:54 PM

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గంటా శ్రీనివాస్ రావు కు ప్రత్యేక స్థానం ఉంది. 1999లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన ఆ తర్వాత నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసిన చోట తిరిగి రెండోసారి వరుసగా పోటీ చేయకుండా వరుస విజయాలు సాధించిన నేపథ్యం అయనది. ప్రస్తుతం 63 ఏళ్ల వయసున్న గంట గంట శ్రీనివాసరావు 2024లో భీమిలి నుంచి పోటీ చేసి ఆ తర్వాత రాజకీయ విరమణ ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు, నారాయణ విద్యాసంస్థల అధినేత తెలుగుదేశం పార్టీకే చెందిన మాజీ మంత్రి నారాయణ అల్లుడు కూడా ఆయన గంటా రవితేజని తన రాజకీయ వాసుడిగా ముందుకు తీసుకొస్తున్నారా అన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటివరకు రవితేజ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనింది పెద్దగా లేదు. కానీ గత వారం రోజులుగా నెల్లూరు జిల్లాలో యువగలం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ తో కలిసి పాల్గొంటున్నారు గంట రవితేజ.

నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రస్తుతం నారాయణ ఉంటున్నారు. నారాయణ కూడా అనారోగ్యం రీత్యా వయసు పైబడ్డ నేపథ్యంలో తాను రాజకీయంగా పోటీ చేయాలా? లేదంటే తన వారసులుగా ఎవరి చేతనైనా పోటీ చేయించాలా ఆన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో గంట రవితేజ తో పాటు తన ఇద్దరు కూతుర్లు తో కలిసి లోకేష్ యువ గళం పాదయాత్రలో కనిపించడం ఆసక్తికరమైన చర్చికి దారితీస్తోంది. వాస్తవానికి గత కొంతకాలంగా విశాఖలో అనకాపల్లి కానీ చోడవరం నియోజకవర్గాల నుంచి రవితేజ చేత పోటీ చేయించాలన్న ఆలోచన గంట శ్రీనివాసరావుకు ఉందన్న చర్చ నడిచింది. తనతో పాటు అవసరమైతే తన వియ్యంకుడైన నారాయణ కోటాలో అయినా రవితేజ కి టికెట్ తెచ్చుకుంటారన్న చర్చ కొనసాగుతూ వస్తుంది.

అయితే గంటా కుమారుడికి టికెట్ ఇస్తే ఇప్పటికే టికెట్లు తన కుమారుడి కోసం టికెట్ అడుగుతున్న అయ్యన్నపాత్రుడు, మరొకవైపు బండారు సత్యనారాయణ మూర్తి లు కూడా తన కుమారులకు టికెట్ అడగాలన్న ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అదిఅంత సాధ్యం కావచ్చన్న విశ్లేషణలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ విశాఖలో వీలు కాకపోతే నెల్లూరు నుంచి నారాయణ కోటాలో, నారాయణ రాజకీయ వారసుడిగా ఘంటా రవితేజ ను బర్లోకి దిగే అవకాశం ఉందా అన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది 2019లో కూడా నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేసి ప్రస్తుత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై ఓటమి పొందారు.

తిరిగి 2024 లో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మాత్రం నారాయణనే అక్కడి నుంచి బరిలోకి దించాలని ఆలోచిస్తోందట. అయితే నారాయణ ఆరోగ్యం, వయసు సహకరిస్తుందా? ఒకవేళ లేదంటే తన రాజకీయ వారసుడు, తన అల్లుడిని నెల్లూరు నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో నారాయణ ఉన్నారట. అందుకే కుమార్తె, అల్లుడితో కలిపి నారాయణ కూడా ఇప్పుడు లోకేష్ యువ గళం పాదయాత్రలో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నియోజకవర్గంలో పాల్గొంటూ ఉన్నారు. ఇదే సమయంలో ఒకవేళ అక్కడ గంట రవితేజ నిలబడితే సమీకరణలు ఎలా ఉంటాయి? విజయవకాశాలు ఎంత ఎంత మేరకు ఉండొచ్చు? అని వియ్యంకులైన ఈ మాజీ మంత్రులు గంటా, నారాయణాలు ఇరువురు చర్చిస్తున్నట్లు సమాచారం.

దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఒకవేళ తన అల్లుడికి టికెట్ ఇప్పిస్తే తాను గెలిపించుకుంటానని అధిష్టానానికి చెప్తే అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఒకవేళ గంటా కుమారుడికి నారాయణ అల్లుడి కోటలో ఇస్తే మిగతా ఇప్పటికే తమ కుమారులకి టికెట్లు అడుగుతున్న అయ్యన్నపాత్రుడు బండారు సత్య నారాయణ మూర్తితో పాటు మిగతా వాళ్ళ డిమాండ్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? లాంటి అనేక రకాల చర్చలకు ప్రస్తుతం గంట రవితేజ అంశం తావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం