Andhra Pradesh: అధ్యక్షుల మార్పుపై విష్ణుకుమార్ రాజు కీలక కామెంట్స్.. ఏమన్నారంటే..
తెలుగు రాష్ట్రాల్లో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పుపై కీలక కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనిని సోము వీర్రాజు విషయంలో కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పార్టీలో అధ్యక్ష మార్పు తర్వాత తనకు కూడా సోము వీర్రాజు..
తెలుగు రాష్ట్రాల్లో బీజీపీ రాష్ట్ర అధ్యక్షుల మార్పుపై కీలక కామెంట్స్ చేశారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ఎవరైనా పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనిని సోము వీర్రాజు విషయంలో కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పార్టీలో అధ్యక్ష మార్పు తర్వాత తనకు కూడా సోము వీర్రాజు అందుబాటులో లేరని చెప్పారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. పార్టీని బలోపేతం చేయడంలో ఇదో గేమ్ చేంజర్ అని చెప్పారు. సోము వీర్రాజు తొలగించడం సెడన్ నిర్ణయమేమికాదని.. ఆయన టర్మ్ అయిపోవడంతోనే మార్పు జరిగిందన్నారు. పార్టీ బలోపేతం చేసేందుకే అధ్యక్షులను మార్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు ఆయన శాయశక్తుల కృషి చేశారని చెప్పారు. సోము సహాయ సహాకారాలు కూడా ఇకపై కూడా తీసుకుంటుందన్నారు విష్ణుకుమార్ రాజు
రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో పొత్తులపై కేంద్రానిదే తుది నిర్ణయమని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన ఫురందేశ్వరికి జాతీయ నాయకత్వంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయని..ఆమె ద్వారా రాష్ట్రంలో పొత్తులపై జాతీయ నాయకత్వానికి తెలియజేస్తామని చెప్పారు విష్ణుకుమార్ రాజు. తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందన్నారు. అందులో భాగంగానే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారని తెలిపారు. రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఈరోజు కేంద్రంలో 300 సీట్లు సాధించింది.. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న విష్ణుకుమార్ రాజు.. 2024లో వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమంటూ శపదం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..