Andhra Pradesh: చెల్లి పెళ్లి కోసం అప్పులు.. అన్నను బలి తీసుకున్న క్రికెట్ బెట్టింగ్..
క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.. తనువు చాలించాడు. బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లాలో యువకుడు బలయ్యాడు.
క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. చేసిన అప్పు తీర్చలేక.. కుటుంబ పరువు పోతుందన్న మనస్థాపంతో సూసైడ్ చేసుకున్నాడు.. తనువు చాలించాడు. బెట్టింగ్ భూతానికి అనకాపల్లి జిల్లాలో యువకుడు బలయ్యాడు. చెల్లెలు పెళ్లి కోసం అప్పులు చేసిన యువకుడు.. ఆ అప్పుల నుంచి గట్టెక్కెందుకు బెట్టింగ్ వైపు మారాడు. బెట్టింగ్‌ల్లో తీవ్రంగా నష్టపోయి అప్పుల బాధలు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన 25 ఏళ్ల మణికంఠ సాయికుమార్‌కు ఇద్దరు చెల్లెలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో తోబుట్టునకు వివాహం చేసేందుకు అప్పులు చేశాడు. దాదాపు 3 లక్షల వరకు తీసుకొని పెళ్లి కోసం ఖర్చు చేశాడు. చేసినా అప్పుకు తెర్చే మార్గం లేక… బెట్టింగ్ పై ఆశలు పెట్టుకున్నాడు. బెట్టింగ్‌లో 40 వేల రూపాయలు కోల్పోయాడు. బెట్టింగ్ డబ్బుల కోసం బెట్టింగ్ రాయుళ్లు టార్చర్ పెట్టడంతో కుటుంబ పరువు పోతుందన్న .. మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడు మణికంఠ. చేతికి అంది వచ్చినా కొడుకు ప్రాణాలు తీసుకోవడంతో ఆకుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..