Andhra Pradesh: సీఎం జగన్ ఢిల్లీ టూర్‌లో అసలు మ్యాటర్ వేరే ఉందా? పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న గుసగుసలు నిజమేనా?!
రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి అని ఓ ట్యాగ్ లైన్ పెట్టుకుని సీఎం జగన్ మరోసారి ఢిల్లీ టూర్‌కు రెడీ అయ్యారు. పైకి రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అని చెప్పుకున్నా లోపల మాత్రం జరిగే చర్చలు వేరు అన్నది గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర పెద్దలతో భేటీ వెనుక రాజకీయ ఎజెండా ఉందా..?
రాష్ట్ర సమస్యలపై చర్చించడానికి అని ఓ ట్యాగ్ లైన్ పెట్టుకుని సీఎం జగన్ మరోసారి ఢిల్లీ టూర్‌కు రెడీ అయ్యారు. పైకి రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు అని చెప్పుకున్నా లోపల మాత్రం జరిగే చర్చలు వేరు అన్నది గట్టిగా వినిపిస్తోంది. కేంద్ర పెద్దలతో భేటీ వెనుక రాజకీయ ఎజెండా ఉందా..? ఆ రెండు పార్టీల బంధంపై చర్చిస్తారా..? సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు మర్మమేంటి..?
నిజానికి ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా.. ఇప్పుడే ఎలక్షన్ మూడ్ కనిపిస్తోంది. వ్యూహ ప్రతి వ్యూహాలతో రాజకీయం వేడెక్కుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. వైఎస్ఆర్‌సీపీని అధికారం నుంచి దించడమే తమ లక్ష్యమని ఇప్పటికే ప్రకటించిన విపక్ష నేతలు.. అందుకోసం ఏం చేయాలో అది చేస్తామన్నారు. ఇలాంటి సమయంలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం మరింత ఆసక్తి రేపుతోంది. సాధారణంగా అయితే, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు, నిధుల అంశంపై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తుంటారు సీఎం జగన్. గతంలో అనేక సార్లు జగన్ ఢిల్లీకి వెళ్లిన జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కీలక ప్రాజెక్టులపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. కానీ ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్యటనలో నిధులతో పాటు రాజకీయ కారణాలు ఉన్నాయనే చర్చ జోరుగా జరుగుతోంది.
పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటికే 12 వేల 911.15 కోట్ల విడుదలకు కేంద్ర అంగీకారం తెలిపింది. కేబినెట్ ఆమోదం ద్వారా నిధులు విడుదల కానున్నాయి. అటు రెవిన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇక ఇవాళ ఢిల్లీ ఫైట్ ఎక్కనున్న జగన్… ఇక విభజన హామీలపై ప్రధానితో చర్చిస్తారని చెబుతున్నారు. అయితే లోపల జరిగే మంతనాలు వేరు అన్నది గట్టిగా వినిపిస్తున్న మాట. ప్రధానితో భేటీలో రాజకీయ అంశాలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో బీజేపీ పెద్దల వైఖరి ఎలా ఉందనే విషయంపై ప్రధానితో జగన్ చర్చిచనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న జనసేన చేస్తున్న తీవ్ర విమర్శలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు.
ఇక ఇటీవల ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన సర్వేలో వైసీపీకి తిరుగులేదని వెల్లడైంది. తాజా సర్వేతో పాటు ఏపీలో వైసీపీకున్న ఆదరణను ప్రధాని మోదీ వద్ద చర్చిస్తారని తెలుస్తుంది. మొత్తానికి గత పర్యటనలకంటే ఈసారి సీఎం ఢిల్లీ టూర్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని విశ్వసనీయ సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..